Begin typing your search above and press return to search.

నేపాల్‌లో 'ప్రభాస్‌' ఊరు.. ఇది అసలు కథ!

ప్రభాస్‌కి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు, ఉంటారు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 11:30 AM GMT
నేపాల్‌లో ప్రభాస్‌ ఊరు.. ఇది అసలు కథ!
X

ప్రభాస్‌కి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు, ఉంటారు అనడంలో సందేహం లేదు. బాహుబలి, సాహో, కల్కి, సలార్‌ సినిమాలతో పాన్ వరల్డ్‌ స్టార్‌గా నిలిచిన ప్రభాస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల సంఖ్య భారీ మొత్తంలో ఉంటుంది. సాధారణంగా అభిమానులు తమ అభిమానం చాటుకోవడం కోసం అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి మంచి పేరును పెట్టుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుల పేరుతో గ్రామాలు, వీధుల పేర్లు ఉంటాయి. అలాగే హీరోల పేర్లతోనూ కొన్ని వీధులకు, కొన్ని ప్రాంతాలకు అధికారికంగా లేదా అనధికారికంగా పేర్లు ఉంటాయి అనే విషయం తెల్సిందే.

మన పక్క దేశం నేపాల్‌లో ప్రభాస్‌ పేరుతో ఒక గ్రామం ఉంది. ఈ పేరును అక్కడి వారు ప్రభాస్‌పై అభిమానంతో పెట్టుకోలేదు. ప్రభాస్ పుట్టక ముందు నుంచి ఆ ఊరు ఉంది, ఆ ఊరుకు ఆ పేరు ఉంది. సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు నేపాల్‌లోని ప్రభాస్ అభిమానులు కొందరు తమ ఊరుకు ప్రభాస్ అని పేరు పెట్టుకున్నారు అంటూ ఫన్నీగా ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అంటే ఒక ఇండియన్ యూట్యూబర్‌ నేపాల్‌లో తన బైక్‌తో రైడ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడికి ప్రభాస్ అనే ఊరు కనిపించింది. వెంటనే ఆ బోర్డ్‌ను అతడు తన కెమెరాలో బంధించి సరదాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ప్రభాస్‌తో అక్కడి వారికి సంబంధం లేదు, అక్కడి వారిలో ఒకరు ఇద్దరికీ తప్ప ప్రభాస్ గురించి తెలియదని అతడు చెప్పుకొచ్చాడు. ప్రభాస్ సినిమాలు నేపాల్‌లో గతంలో విడుదల అయినా ఆ ఊరుకు చెందిన వారు కొద్ది మంది మాత్రమే అతడి సినిమాలు చూసినట్లుగా కూడా అతడు పేర్కొన్నాడు. మొత్తానికి ప్రభాస్‌ అనే గ్రామంను నేపాల్‌లో చూసి తాను సర్‌ప్రైజ్ అయ్యాను అని, మీరు కూడా సర్‌ప్రైజ్ అవుతారు అని తాను ఈ పోస్ట్‌ పెడుతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేశాడు. ప్రభాస్ అనే ఊరు నేపాల్‌లో ఉందన్న విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కొందరు ఆ గ్రామం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ సలార్‌ 1, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మారతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. రాజా సాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఫౌజీ సినిమా సైతం త్వరలోనే పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు, రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని ప్రభాస్‌ ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. మరి మేకర్స్‌ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ జత కట్టబోతున్నాడు. ఇదే ఏడాదిలో ఆ సినిమా పట్టాలెక్కి, వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.