Begin typing your search above and press return to search.

ప్రభాస్ లీక్స్.. ముద్దు పొందిన ఆ అమ్మాయి ఎవరంటే..

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ స్థాయి ఏ లెవెల్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   16 March 2025 10:01 AM IST
ప్రభాస్ లీక్స్.. ముద్దు పొందిన ఆ అమ్మాయి ఎవరంటే..
X

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ స్థాయి ఏ లెవెల్లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి ఫ్రెండ్లీ స్వభావం ఉన్నప్పటికీ అతను ఇంట్రోవర్ట్ అని తెలిసిన విషయమే. ఎక్కడైనా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్స్ అంటే మౌనంగా కనిపించే ప్రభాస్.. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రం వేరే లెవెల్ ఫన్నీగా ఉంటాడట. సరదాగా హంగామా చేయడం, తనదైన హాస్యంతో చుట్టుపక్కల వారిని నవ్వించడం ప్రభాస్ స్టైల్.

అయితే ప్రస్తుతం మ్ ప్రభాస్ నుంచి కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. ఓ పాత ఫోటోను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ ఎంతో ముచ్చటగా ఒక అమ్మాయిని బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనిని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతూ.. ప్రభాస్ ఎవరిని ఇలా కిస్ చేశాడు? అని చర్చించుకోవడం స్టార్ట్ చేశారు.

అసలిది కొత్త ఫోటో కాదని అర్థమయినా, అందులో కనిపిస్తున్న అమ్మాయి ఎవరు అనే దానిపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఫోటో ‘బాహుబలి’ టైమ్‌లో క్లిక్ అయినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి తమన్నా క్లోజ్ ఫ్రెండ్, మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్ అని లేటెస్ట్ అప్‌డేట్. ప్రభాస్ ఇంత ఫ్రెండ్లీగా తన టీమ్‌తో ఉంటాడని అంతా గమనిస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్స్ సాధారణంగా మేకప్ ఆర్టిస్టులు, స్టైలింగ్ టీమ్‌తో ఒక లిమిట్ దాటకుండా ఉంటారు.

కానీ ప్రభాస్ మాత్రం తన వర్క్ సర్కిల్‌లో అందరికీ ఓ మంచి ఫ్రెండ్‌లా మెలుగుతాడని ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం. కాస్త మంచిగా అనిపించినా కూడా బోజనాలతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.ఇక లేటెస్ట్ గా ఈ పాత ఫోటో వైరల్ కావడంతో ‘ఇంత ఫ్రెండ్లీ యాక్టర్ వేరెవరైనా ఉన్నారా?’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి. సెట్స్ మీద ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ తర్వాత సలార్ 2 కూడా చేయనున్నాడు. ప్రశాంత్ వర్మతో ఓ పాన్ ఇండియా సినిమా చర్చల్లో ఉండగా, KGF మేకర్స్ తో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకులు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం పూర్తి ఫోకస్ ‘రాజా సాబ్’ మూవీపై పెట్టాడు. కానీ ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుండడంతో, విడుదల తేదీపై స్పష్టత రాలేదు. మొదటగా ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని అనుకున్నా, మారిన షెడ్యూల్ వల్ల కొత్త డేట్‌పై ఇంకా అనౌన్స్‌మెంట్ లేదు. త్వరలోనే ప్రభాస్ టీమ్ నుంచి సినిమాల అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.