Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఈ స్టెప్పులో నువ్వే తోపు

అయితే నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే ది రాజాసాబ్ సినిమాలో మాత్రం మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయనే విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 5:15 PM GMT
ప్రభాస్.. ఈ స్టెప్పులో నువ్వే తోపు
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత సినిమాలలో పెద్దగా డాన్స్ లు చేయడం లేదు. నిజానికి బాహుబలి నుంచి ప్రభాస్ డాన్స్ చేయడానికి స్కోప్ ఉన్న సాంగ్స్ పెద్దగా పడలేదని చెప్పాలి. బాహుబలి సినిమాలో డ్యూయెట్స్ ఉన్న కూడా వాటిని ప్యూర్ మెలోడి బీట్స్ తో విజువల్ ట్రీట్ గా రాజమౌళి ప్రెజెంట్ చేశారు. అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేయడానికి కావాల్సిన ఎనర్జిటిక్ సాంగ్స్ ఇప్పటి వరకు ప్రభాస్ కి పడలేదు.

కల్కి 2898ఏడీ సినిమాలో టక్కర టక్క సాంగ్ లో కాస్తా డాన్స్ కి స్కోప్ ఉన్న కూడా హెవీ స్టెప్స్ వేయడానికి అందులో ఛాన్స్ లేదు. అయితే నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే ది రాజాసాబ్ సినిమాలో మాత్రం మంచి డాన్స్ నెంబర్స్ ఉంటాయనే విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చారు. ఒకప్పటి తరహాలో ప్రభాస్ డాన్స్ ని రాజాసాబ్ చిత్రంలో ఆస్వాదిస్తారని అన్నారు.

అయితే ప్రభాస్ కి డాన్స్ రాదని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో డాన్స్ పరంగా ప్రభాస్ ని కంపారిజన్ చేసి ఓ వర్గం హీరోల అభిమానులు చూపించి కామెంట్స్ చేస్తారు. అయితే టాలీవుడ్ లో ఆ ముగ్గురు బెస్ట్ డాన్సర్స్ అనే సంగతి అందరికి తెలిసిందే. వారితో పోలిక పక్కన పెడితే ప్రభాస్ కి డాన్స్ రాదనే మాట నిజం కాదు.

గతంలో ప్రభాస్ చాలా సినిమాలలో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అలరించాడు. ముఖ్యంగా వేవ్ స్టెప్స్(wave steps) అయితే ప్రభాస్ చేసేంత పెర్ఫెక్ట్ గా ఇంకెవరు చేయలేరు. ప్రభాస్ హైట్ కారణంగా వేవ్ స్టెప్ కి ఒక అందం వస్తుందని చెప్పొచ్చు. గతంలో ఢీ డాన్స్ షోలో శేఖర్ మాస్టర్ కూడా ప్రభాస్ వేసే వేవ్ స్టెప్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. వేవ్ స్టెప్స్ కి సంబందించిన వీడియో క్లిప్ కూడా డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే ప్రభాస్ డాన్స్ గురించి డిస్కషన్ జరగడానికి కారణం ఉంది. రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటిస్తోన్న ఇమాన్వి ఇస్మాయిల్ మంచి డాన్సర్. ఇమాన్వికి డాన్స్ పరంగా ప్రభాస్ ఏమైనా పోటీ ఇవ్వగలడా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపించింది. ఇద్దరు కలిసి డాన్స్ చేయాల్సి వస్తే ప్రభాస్ ఆమె ముందు తేలిపోతాడనే కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే వీటికి కౌంటర్ గా డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ డాన్స్ చేసిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ప్రభాస్ డాన్స్ తో అందరిని ఫిదా చేయడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వేవ్ డాన్స్ లో ప్రభాస్ ని మించిన వారు ఎవరు లేరని అంటున్నారు. అందులో డార్లింగ్ తోపు అంటూ బాహుబలికి ముందు ప్రభాస్ చేసిన సినిమాలలో వేవ్ డాన్స్ స్టెప్స్ తో వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.