Begin typing your search above and press return to search.

బిగ్గెస్గ్ మల్టివర్స్ లో ప్రభాస్..?

సౌత్ లో మోస్ట్ క్రేజీయస్ట్ ఫ్రాంచైజ్ గా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది ఇందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలను స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Nov 2024 4:20 AM GMT
బిగ్గెస్గ్ మల్టివర్స్ లో ప్రభాస్..?
X

సౌత్ లో మోస్ట్ క్రేజీయస్ట్ ఫ్రాంచైజ్ గా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఇందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలను స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ వీటికి సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలి’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

దీని తర్వాత లోకేష్ కార్తీతో ‘ఖైదీ’ సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇండియన్ నెంబర్ వన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా లోకేష్ ప్రభాస్ కి కథ చెప్పాడని, అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. గతంలో లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తానని చెప్పారు. అయితే అది ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పుడు అదే న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. లోకేష్ కథకి ప్రభాస్ చాలా ఇంప్రెస్స్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ ఉండబోతుందని అంటున్నారు. 1000 కోట్ల బడ్జెట్ తో లోకేష్ కనగరాజ్ ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతం ఇదంతా ఒక ప్రచారం గానే ఉంది. ప్రభాస్ లైన్ అప్ లో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయ్యేసరికి కనీసం మూడు నుంచి నాలుగు ఏళ్లు పడుతుంది.

లోకేష్ కనగరాజ్ నిజంగా ప్రభాస్ కి కథ చెప్పిన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టొచ్చు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పట్లో దానికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ప్రభాస్ భాగం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన స్టోరీకి కూడా ఇప్పటి వరకు ప్రభాస్ ఓకే చెప్పలేదని టాక్. ఆయన కూడా లోకేష్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ప్రభాస్ లో సినిమాలు కన్ఫర్మ్ అయిపోయినట్లు న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వీటి తర్వాత ‘కల్కి 2898ఏడీ’, ‘సలార్ 2’ కంప్లీట్ చేస్తాడని అనుకుంటున్నారు.