Begin typing your search above and press return to search.

ప్రభాస్ - హను.. ఎంతవరకు వచ్చిందంటే..

సీతారామం సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి.

By:  Tupaki Desk   |   24 Jun 2024 4:41 AM GMT
ప్రభాస్ - హను.. ఎంతవరకు వచ్చిందంటే..
X

సీతారామం సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ జెనరేషన్ లో కూడా కావ్యంలాంటి ప్రేమకథని సీతారామం ద్వారా చెప్పడంలో హను సక్సెస్ అయ్యాడు. అందుకే రిలీజ్ అయిన అన్ని భాషలలో సీతారామం మూవీ సూపర్ హిట్ అయ్యింది. హిందీలో ఆడియన్స్ కి కూడా మూవీ విపరీతంగా కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే సీతారామం తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న హను రాఘవపూడి ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యింది. గత కొంతకాలంగా మూవీ స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఈ చిత్రాన్ని కూడా హను రాఘవపూడి ప్రేమకథగానే చెప్పబోతున్నాడంట. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా ప్రభాస్ మూవీ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన హను పూజా కార్యక్రమాలు కూడా చేశారు. అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహాస్వామి ఆలయంలో ఈ స్క్రిప్ట్ కి ప్రత్యేక పూజలు చేశారు. పూజాదికాలు అనంతరం వేద బ్రాహ్మణుల ఆశీర్వాదాలు కూడా హను రాఘవపూడి స్వీకరించారు. ఇక మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ పైన ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. హను రాఘవపూడి సినిమాలు అంటే హీరోతో సమానమైన ప్రాధాన్యత హీరోయిన్ క్యారెక్టర్ కి కూడా ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలని హను సృష్టిస్తాడు. సీతారామం సినిమాలో సీత అలియాస్ నూర్జహాన్ పాత్ర ఇంపాక్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఉంటుంది.

అందుకే ప్రభాస్ కి కాంబినేషన్ గా ఏ హీరోయిన్ ని తీసుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొంది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి2898ఏడీ ప్రమోషన్స్ లో ఉన్నారు. అలాగే సలార్, రాజాసాబ్ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ స్టార్ట్ చేస్తాడు. దాంతో పాటుగానే హను రాఘవపూడి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందంట.