Begin typing your search above and press return to search.

ప్రభాస్.. మరో పెద్ద ఛాలెంజ్

దాని ప్రకారం 2023లో ఆది పురుష్, సలార్.. రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాట నిలబెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 1:30 AM GMT
ప్రభాస్.. మరో పెద్ద ఛాలెంజ్
X

'బాహుబలి' తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా 'సలార్' తో సక్సెస్ అందుకొని కం బ్యాక్ ఇచ్చిన డార్లింగ్ ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తానని అన్నాడు. 'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేసాడు. ఇకపై ఏడాదికి 2 లేదా.. మూడు సినిమాలు చేస్తానంటూ మాట ఇచ్చాడు.

దాని ప్రకారం 2023లో ఆది పురుష్, సలార్.. రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాట నిలబెట్టుకున్నాడు. ఇకపై కూడా అదే దారిలో వెళ్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న తరుణంలో అదే తరహాలో సినిమాలు కంప్లీట్ చేసి, ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేస్తారా? అనేది అభిమానుల ముందున్న ప్రశ్న. సలార్ తో సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

వీటిలో 'కల్కి 2898AD' చివరి దశలో ఉంది. మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేకర్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిలిం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్వినిదత్ సుమారు 600 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి కలయికలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్', హనురాఘవపుడితో ఓ పీరియాడికల్ లవ్ డ్రామాకి కమిట్ అయ్యాడు ప్రభాస్.

ఇందులో స్పిరిట్ ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. దాంతో పాటు :సలార్ 2' కూడా పెండింగ్ లోనే ఉంది. ఇన్ని సినిమాలను ఒకేసారి లైన్ లో పెట్టిన ప్రభాస్ ఈ ఏడాది నుంచి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేస్తే ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే అవుతుంది. మరి డార్లింగ్ మాట నిలబెట్టుకుంటాడా? లేదా అనేది చూడాలి.