Begin typing your search above and press return to search.

యుద్ధ నేపథ్యంలో ప్రేమకథ.. బ్రిటీష్ సైనికుడిగా ప్రభాస్?

ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.

By:  Tupaki Desk   |   15 July 2024 12:21 PM GMT
యుద్ధ నేపథ్యంలో ప్రేమకథ.. బ్రిటీష్ సైనికుడిగా ప్రభాస్?
X

'సలార్', 'కల్కి 2898 ఎ.డి' వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. రానున్న రోజుల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, మేకర్స్ సైడ్ నుంచి ఈ మూవీ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్, ప్రభాస్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ తో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నానని, ఇదొక హిస్టారికల్ ఫిక్షన్ మూవీ అని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవలే స్పష్టం చేశారు. అయితే ఇది యుద్ధ నేపథ్యంలో సాగే హను మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరిగే అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.

అందమైన ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరైన హను రాఘవపూడి.. యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ 'సీతారామం' వంటి పీరియడ్ రొమాంటిక్ లవ్ డ్రామాతో తన కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో దాదాపు ఇలాంటి వార్ బ్యాక్ డ్రాప్ లోనే, బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జియర్ కథని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సైనికుడి పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్‌ గా మేకోవర్‌ కానున్నారని అనుకుంటున్నారు.

ఇకపోతే ప్రభాస్ తో హను చేయబోయే సినిమాకి 'ఫౌజి' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం వస్తుంది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీని కోసం కొన్ని స్పెషల్ సెట్స్ నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అలానే ఆల్రెడీ మూడు పాటలను కూడా రికార్డ్ చేసినట్లుగా దర్శకుడు తెలిపారు.

ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చనున్నారు. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' సినిమా చేస్తున్నారు. 'కల్కి 2', 'సలార్ 2' చిత్రాలు కూడా లైనప్ లో ఉన్నాయి. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే సినిమా చేయాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారిగా పోలీస్ గా కనిపించనున్నారు. అలానే హను చిత్రంలో సైనికుడిగా నటిస్తారని అంటున్నారు. ఏదేమైనా డార్లింగ్ తన ఫ్యాన్స్ కోసం వేటికవే ప్రత్యేకమైన సినిమాలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన్ను మరిన్ని కొత్త పాత్రల్లో చూసే అవకాశం ఉంది.