ప్రభాస్ దర్శకులకు ఇప్పుడు మామూలు టెన్షన్ కాదు
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇమేజ్ హై ఎండ్ లోకి వెళ్ళిపోయింది.
By: Tupaki Desk | 27 Jun 2024 4:34 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సినిమాకి తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా 22 భాషలలో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇమేజ్ హై ఎండ్ లోకి వెళ్ళిపోయింది. అయితే తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.
సలార్ మరల ప్రభాస్ ఇమేజ్ ని నిలబెట్టింది. ఇప్పుడు కల్కి 2898ఏడీ మూవీ అయితే హాలీవుడ్ రేంజ్ కి ప్రభాస్ మాస్ ఇమేజ్ ని తీసుకొని వెళ్లబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే యూఎస్ ప్రీమియర్ షోలు చూసిన వారి నుంచి మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విజువల్ స్పెక్టక్యులర్ గా మూవీ ఉందనే మాట వినిపిస్తోంది. గ్రాఫిక్స్ పరంగా నాగ్ అశ్విన్ బెస్ట్ వర్క్ ఇచ్చారని అంటున్నారు.
అయితే కల్కి 2898ఏడీ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ ఇమేజ్ ఇంకా పెరిగిపోతుంది. అతని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద టూమచ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కల్కి మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ట్రైలర్స్ ద్వారానే భారీ హైప్ ని క్రియేట్ అయ్యింది. ఈ హైప్ ప్రభాస్ తో నెక్స్ట్ సినిమాలు చేసే దర్శకులకి చాలెంజింగ్ టాస్క్ అనే మాట వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయనున్న సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి మీద చాలా పెద్ద భారమే ఇప్పుడు పడబోతోంది. ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆ దర్శకుడు ఇప్పటివరకు ఈ రేంజ్ అగ్ర హీరోలతో చేయలేదు. కాబట్టి ఎలా డీల్ చేస్తాడనేది అసలు అంశం. ఏదేమైనా ప్రభాస్ లైనప్ లో ఉన్న ముగ్గురు దర్శకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సందీప్ రెడ్డి వంగా అయితే యానిమల్ మూవీతో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు.
స్పిరిట్ సినిమా అంతకుమించి వైలెన్స్ తో ఉంటుందనే మాట వినిపిస్తోంది. ప్రేమకథలతో మూవీస్ చేసే హను రాఘవపూడి ప్రభాస్ ఇమేజ్, హైప్ ని ఎలా క్యారీ చేస్తూ సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వార్ లవ్ ఏమోషనల్ కంటెంట్ తో అతను కథను సిద్ధం చేసుకున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ చేయబోయే సలార్ 2 మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి. మరి ఆ దర్శకుడు డార్లింగ్ ను ఇంకా ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడో చూడాలి.