Begin typing your search above and press return to search.

ప్రభాస్ Vs ప్రభాస్: డార్లింగ్ ను కొట్టేవాడే లేడా?

ఇలా టాలీవుడ్ టాప్-7 గ్రాసర్స్ లిస్టులో ప్రభాస్ నటించిన సినిమాలే 6 ఉండటం విశేషం. ఇప్పట్లో ఏ తెలుగు స్టార్ హీరో కూడా డార్లింగ్ కు దరిదాపుల్లోకి వచ్చేలా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   16 July 2024 5:05 PM GMT
ప్రభాస్ Vs ప్రభాస్: డార్లింగ్ ను కొట్టేవాడే లేడా?
X

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రెండేళ్ళ కాలంలో నాలుగు భారీ చిత్రాలను అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'సలార్', 'కల్కి 2898 AD' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టి, అసలైన పాన్ ఇండియా హీరో అనిపించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎవరూ అందుకోలేని సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న డార్లింగ్.. ఈ క్రమంలో తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన ప్రభాస్.. తన స్టార్ డమ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. 'సలార్' మూవీ ₹ 700 కోట్లకు పైగా వసూలు చేయగా.. 'కల్కి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

'బాహుబలి 2' సినిమాతో తొలిసారిగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేసారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' మూవీతో మరోసారి ఆ మైల్ స్టోన్ మార్క్ క్రాస్ చేసి, రెండుసార్లు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న మొదటి సౌత్ హీరోగా, రెండో ఇండియన్ యాక్టర్ గా చరిత్ర సృష్టించారు. ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళు సాధించడం ఖాయమని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్ లోనూ ప్రభాస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.

అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాను పరిశీలిస్తే, ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' మూవీ ₹1810 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత RRR చిత్రం ₹1387 కోట్ల కలెక్షన్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. 'కల్కి' ₹1050 కోట్లకి పైగా గ్రాస్ తో మూడో స్థానంలో ఉండగా.. 'సలార్' (₹720 కోట్లు), 'బాహుబలి 1' (₹650 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జపాన్ వసూళ్లను కలుపుకొని 'సాహో' సినిమా ₹470 కోట్లు కలెక్ట్ చేస్తే, 'ఆది పురుష్' చిత్రం ఫ్లాప్ టాక్ తోనూ ₹440 కోట్లు రాబట్టగలిగింది.

ఇలా టాలీవుడ్ టాప్-7 గ్రాసర్స్ లిస్టులో ప్రభాస్ నటించిన సినిమాలే 6 ఉండటం విశేషం. ఇప్పట్లో ఏ తెలుగు స్టార్ హీరో కూడా డార్లింగ్ కు దరిదాపుల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. కానీ ప్రభాస్ మాత్రం తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ, బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ సక్సెస్ జోష్ లో రాబోయే రోజుల్లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

మారుతి దర్శకత్వంలో 'ది రాజ్ సాబ్' అనే చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' మూవీని అనౌన్స్ చేశారు. అలానే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. వీటితో పాటుగా సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని జానర్ సినిమాలు. ఇవి కచ్ఛితంగా సంచలన విజయాలను నమోదు చేస్తాయని, రెబల్ స్టార్ ఖాతాలో మరిన్ని రికార్డ్స్ వచ్చి చేరుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.