Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఒకటి ముందుకి, మరోటి వెనక్కి?

'ఫౌజీ' సినిమా 1940స్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. షూటింగ్ అంతా దాదాపు సెట్ లోనే పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   19 July 2024 3:25 AM GMT
ప్రభాస్.. ఒకటి ముందుకి, మరోటి వెనక్కి?
X

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ ను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో నాలుగు పాన్ ఇండియా చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. కాకపోతే ఇప్పుడు వాటి ప్రాధాన్యత క్రమం మారుతున్నట్లుగా తెలుస్తోంది.

గతేడాది చివర్లో 'సలార్' సినిమాతో మంచి విజయం సాధించిన ప్రభాస్.. లేటెస్టుగా 'క‌ల్కి 2898 AD' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ రాబోయే సినిమాల గురించి జోరుగా చ‌ర్చలు జరుగుతున్నాయి. ఏ సినిమా ముందుగా థియేటర్లలోకి వస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్ర‌భాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు టీ-సిరీస్ బ్యానర్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక డార్లింగ్ లైనప్ లో ప్రశాంత్ నీల్ 'సలార్ 2' సినిమా ఉండనే ఉంది.

ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ జరుపుకున్న 'ది రాజా సాబ్' సినిమా ముందుగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారని అంద‌రూ భావించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్తామని చెప్పారు. అయితే ఈ సినిమా ప్రీ-ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యం పడుతుందని, దాని కంటే ముందుగా హను రాఘ‌వ‌పూడి చిత్రాన్ని ప్రారంభించాలని ప్రభాస్ నిర్ణ‌యించుకున్నారట.

'ఫౌజీ' సినిమా 1940స్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియడ్ యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. షూటింగ్ అంతా దాదాపు సెట్ లోనే పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాతే 'స్పిరిట్' చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. మరి హను సినిమాని ముందుకి తీసుకొచ్చి, సందీప్ వంగా చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారనే విష‌యాల‌పై త్వరలోనే క్లారిటీ రానుంది.