Begin typing your search above and press return to search.

దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా ప్ర‌భాస్ ఎలా ఎదిగాడు?

ప్రభాస్ ఒక అసాధార‌ణ సూప‌ర్‌స్టార్‌గా ఎద‌గ‌డానికి కార‌ణం అత‌డి హార్డ్ వ‌ర్క్.. స్క్రిప్ట్ సెల‌క్ష‌న్.. ఇన్నోవేష‌న్.. అభిరుచి అన‌డంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   3 July 2024 4:57 PM GMT
దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా ప్ర‌భాస్ ఎలా ఎదిగాడు?
X

భారతీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లో అతిపెద్ద సూపర్‌స్టార్‌గా ప్రభాస్ ఎందుకు రాణిస్తున్నారు? కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు వెంటాడినా కానీ, ఒకే ఒక్క సినిమా(క‌ల్కి 2989 ఏడి)తో గ్రేట్ కంబ్యాక్ ఎలా చూపించ‌గ‌లిగాడు? .. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సందేహ‌మిది. అయితే అన్ని సందేహాల‌కు స‌మాధానం ఉంది.


ప్రభాస్ ఒక అసాధార‌ణ సూప‌ర్‌స్టార్‌గా ఎద‌గ‌డానికి కార‌ణం అత‌డి హార్డ్ వ‌ర్క్.. స్క్రిప్ట్ సెల‌క్ష‌న్.. ఇన్నోవేష‌న్.. అభిరుచి అన‌డంలో సందేహం లేదు. స్క్రిప్టు ఎంపిక‌లో ప్ర‌తిసారీ వైవిధ్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు.. సాహ‌సాలు చేస్తున్నాడు ఒక ర‌కంగా. ఎటువంటి పాత్రనైనా తెర‌పైకి అద్భుతంగా తేవ‌డంలో అత‌డు నిరూపించుకుంటున్నాడు. చేసే ప‌నిలో చిత్తశుద్ధి ప్ర‌భాస్ ని దేశం హృదయ స్పందనగా మారింది. అత‌డి స్క్రిప్టు ఎంపిక‌లు మాస్ కి ప్రియమైన వ్యక్తిగా మార్చాయి. తన నిజాయితీ, సంకల్పం, అభిరుచి ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డు జ‌నాద‌ర‌ణ పొంద‌టానికి కార‌ణం ఇదే. ప్రభాస్ తన అద్భుతమైన ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మ‌రైజ్ చేయ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కావ‌డం లేదు. వెర‌సి ఇలాంటి మ‌రెన్నో కార‌ణాలు అతడికి ప్రపంచవ్యాప్తంగా అంకిత‌మైన‌ అభిమానులను సంపాదించిపెట్టాయ‌నడంలో సందేహం లేదు.

ఇప్పుడు ప్ర‌భాస్ కి కేవ‌లం భార‌త‌దేశం, అమెరికా, బ్రిట‌న్ లేదా కొరియాలో మాత్ర‌మే కాదు.. జపాన్ లోను గొప్ప అభిమానులున్నారు. ముఖ్యంగా జ‌ప‌నీ అభిమానుల‌కు బాహుబ‌లి క‌నెక్ట్ అయిన తీరు మామూలుగా లేదు. ఇటీవ‌ల అత‌డి జ‌ప‌నీ అభిమానులు `కల్కి 2898 AD` సినిమాని చూడటానికి జపాన్ నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించారంటే అర్థం చేసుకోవాలి. డార్లింగ్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఏ రేంజులో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో డార్లింగ్ కి ఉన్న లోతైన అనుబంధాన్ని ఆవిష్క‌రించిన అరుదైన ఘ‌ట‌న ఇది.

క‌ల్కి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ హైదరాబాద్‌- ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఐకానిక్ రెబెల్ ట్రక్ పక్కన నిలబడి ఉన్న ముగ్గురు జపాన్ అభిమానుల ఫోటోలను షేర్ చేసింది. స్నాప్ షాట్స్ లో ప్రభాస్ పాత్ర భైర‌వ‌.. అతడి సిగ్నేక‌ర్ వెహిక‌ల్ యానిమేటెడ్ వెర్షన్‌తో ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను జ‌ప‌నీ అభిమానులు గర్వంగా పట్టుకుని క‌నిపించారు. ``కల్కి 2898 AD. విడుదలైనందుకు అభినందనలు!! జపనీస్ అభిమానుల నుండి 2024.6.27`` అని ఇందులో రాసారు. 27 జూలై 2024న‌ వీరంతా క‌ల్కి సినిమాని ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్ లో వీక్షించారు.

`సలార్` సహా వ‌రుస‌గా భారీ చిత్రాల‌తో ప్రభాస్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూనే ఉన్నాడు. క‌ల్కితో దీనిని కొన‌సాగించాడు. అత‌డి చిత్రాల బాక్సాఫీస్ ఓపెనింగ్‌లు ఎల్లప్పుడూ భారీగా, ట్రెండ్‌సెట్టింగ్‌గాను ఉన్నాయి. కల్కి 2898 AD దీనికి మినహాయింపు కాదు. భారతీయ సినిమా హిస్ట‌రీలో ప్ర‌భాస్ కు మూడవ అతిపెద్ద ఓపెనింగ్‌ను క‌ల్కి అందించింది. నిజానికి `బాహుబలి` నుండి సలార్, కల్కి 2898 AD వరకు ప్రభాస్ తన స్టార్ పవర్‌కు సాటి లేదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. అతడి క్రాఫ్ట్ ప‌నితీరు అభిమానుల కోసం అత‌డి అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. అతడిని సమకాలీన సినిమాల్లో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా చేసిన గొప్ప ల‌క్ష‌ణ‌మిది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన `కల్కి 2898 AD' 2898 AD` నాలుగు రోజుల్లో 500కోట్ల క్ల‌బ్ లో చేరిన సంగ‌తి తెలిసిందే. అపోకలిప్టిక్ అనంతర ప్రపంచంలో సాగే క‌థ‌కు, హిందూ ఇతిహాసం మహాభారతం క‌నెక్ష‌న్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు స‌హా ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ త‌దిత‌రులు న‌టించారు.