Begin typing your search above and press return to search.

సలార్.. ప్రభాస్ డైలాగుల లెక్క ఇంతేనా?

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Dec 2023 11:20 AM GMT
సలార్.. ప్రభాస్ డైలాగుల లెక్క ఇంతేనా?
X

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సలార్ రూపంలో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎక్కువ ఫైట్స్ లేకపోయినా డ్రామాతోనే హీరోయిజాన్ని బాగా పండించారు దర్శకుడు నీల్.

మూవీలో ప్రభాస్ తన యాక్షన్ తో దుమ్మదులిపేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ కథను ప్రశాంత్ నీల్ ఇచ్చారని అంటున్నారు. డార్లింగ్ కు నీల్ ఇచ్చిన ఎలివేషన్లు మాములుగా లేవని చెబుతున్నారు. కానీ ఓ విషయంలో ఫ్యాన్స్ కు నిరాశకు గురయ్యారని నెట్టింట వినిపిస్తోంది.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోల నుంచి అభిమానులు మాస్ డైలాగులను ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ డైలాగులు తక్కువగా ఉన్నాయని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

డైలాగ్ డెలివరీలో ప్రభాస్ స్ట్రెంత్ ను అందుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారని కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమాలో ప్రభాస్ చెప్పిన కొన్ని డైలాగులు మాత్రం థియేటర్లలో ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయని ఇంకొందరు చెబుతున్నారు. డైలాగులు తక్కువ ఇవ్వడమే మరో ప్లాన్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

పగిలిందా”, “సారీ”, “రెండు నిమిషాల్లో దొర లా రెడీ చేస్తా”, “కాటరమ్మ రాలేదు”, “ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్” “వాళ్లను గర్ల్ ఫ్రెండ్స్ అంటారు” వంటి కొన్ని డైలాగులు మాత్రం తెగ నచ్చేశాయని చెబుతున్నారు ఫ్యాన్స్. సినిమాకు ఇవి బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొత్తం 38 డైలాగులు చెప్పాడని కొందరు అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

హోంబలే ఫిల్మ్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలో పోషించారు. రవి బస్రూర్ సంగీతమందించారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే రూ.178.7 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో ఇవే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు.