ప్రభాస్ - దిశా.. రొమాంటిక్ టచ్ తో ఎండింగ్!
రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపుగా 550 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 March 2024 11:30 AM GMTటాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అశ్వినీ దత్ ప్రభాస్ కల్కి 2898AD అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 50 ఏళ్ళ అనుభవం ఉన్న వైజయంతి ప్రొడక్షన్స్ లో ఎప్పుడూ లేనంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపుగా 550 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అనేక రకాల కథనాలతో వైరల్ గా మారుతోంది. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతున్నప్పటికీ కూడా ప్రమోషన్స్ హడావిడి అయితే ఇంకా మొదలు కాలేదు. పర్ఫెక్ట్ టైమింగ్ లోనే సినిమా అప్డేట్స్ వదలాలి అని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.
ఇక ప్రస్తుతం మేకర్స్ ఒక సాంగ్స్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు అయితే అన్ని ఇన్ని కావు. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ అలాగే ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాలో ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే కొన్ని మూమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ నెంబర్స్ కూడా హైలెట్ కాబోతున్నాయట.
ఇక దీపిక పడుకోనే ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొక స్పెషల్ పాత్రలో దిశా పటాని కనిపించబోతోంది. ఇక ఆమెతో ప్రభాస్ సన్నివేశాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయట. ముఖ్యంగా వీరి మధ్యలో వచ్చే ఒక లవ్లీ రొమాంటిక్ సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే
సార్డినియా ద్వీపంలో ఒక పాటను చిత్రీకరించిన మేకర్స్ చివరి పాటను చిత్రీకరించడానికి ఇద్దరూ కొత్త ప్రదేశానికి వెళ్లారు.
ఉత్కంఠభరితమైన ఇటాలియన్ సముద్ర తీరాలలో అలాగే బీచ్‌ల నేపథ్యంలో చిత్రీకరించబడిన ఈ గొప్ప పాట సరికొత్త ఫీల్ ను కలిగించే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దిశా పటానీ సినిమాటోగ్రాఫర్ జోర్డ్జే స్టోజిల్జ్‌కోవిక్‌తో సహా మొత్తం టీమ్, వారి కొత్త లొకేషన్ కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్‌గా అద్భుతమైనదిగా ఉంటుందని టాక్ వస్తోంది. ఇది ఫినిష్ అయితే, "కల్కి 2898 AD" షూటింగ్ మొత్తం ఫినిష్ అయినట్లే. దాదాపు ఎడిటింగ్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. ఇక ఫైనల్ అవుట్ ఫుట్ కూడా మరో రెండు మూడు వారాల్లో రెడీ కావచ్చట. ఫైనల్ గా మే 9 షెడ్యూల్ ప్రకారం సినిమాను విడుదల చేయనున్నారు.