Begin typing your search above and press return to search.

కేర‌ళ కి ప్ర‌భాస్ 2 కోట్లు విరాళం!

ఈ నేప‌థ్యంలో తాజాగా డార్లింగ్‌ ప్రభాస్ త‌న స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 6:10 AM GMT
కేర‌ళ కి ప్ర‌భాస్ 2 కోట్లు విరాళం!
X

అంద‌మైన కేర‌ళ‌ని వ‌ర‌ద‌లతో ముంచెత్తిన సంగ‌తి తెలిసిదందే. వ‌య‌నాడ్ జిల్లా ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లిచి వేసింది. వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఇప్ప‌టికీ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. స్వ‌యంగా మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ స‌హా ప‌లువురు న‌టులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న‌సంగ‌తి తెలిసిందే.

అలాగే సెల‌బ్రిటీల నుంచి భారీ ఎత్తున విరాళాలు ఆ రాష్ట్ర సీఎం రిలీప్ ఫండ్ కి చేరుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించారు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు అందించారు. ఇంకా కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ స‌హా ప‌లువురు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు విరాళం అందించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా డార్లింగ్‌ ప్రభాస్ త‌న స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. వయనాడ్‌ త్వరగా కోలుకోవాలని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన వెల్లడించారు. జరిగిన ఘటనపై ప్రభాస్‌ విచారం వ్యక్తం చేశారు. సూర్య, కార్తి, జ్యోతిక కలిసి యాభై లక్షలు, విక్రమ్‌ 25 లక్షలు విరాళ‌మిచ్చారు. మమ్ముట్టి, దుల్కర్‌, మోహన్‌లాల్‌, వంటి మలయాళ తారలు కూడా కేరళ కోసం భారీ ఎత్తున తమవంతు సాయాన్ని ప్రకటించారు.

వివిధ సంస్థ‌లు, చారిటీల నుంచి భారీ ఎత్తున విరాళ‌లు ఆరాష్ట్రానికి అందుతున్నాయి. ఆప‌త్కాలంలో ఇలాంటి స‌హాయాలు ఎంతో అవ‌స‌రం. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి అత్యంత దార‌ణంగా ఉంది. తిన‌డానికి తిండి లేక‌, క‌ట్టుకోవ‌డానికి బ‌ట్ట‌లు కూడా లేని ద‌య‌నీయ ప‌రిస్థితులు అక్క‌డ క‌నిపిస్తున్నాయి. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో క‌న్నీళ్లు పెట్టిస్తున్నాయి.