Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'స్పిరిట్‌' డబుల్‌ అప్‌డేట్‌

మరో వైపు సలార్‌ 2 మరియు కల్కి 2 సినిమాలు కూడా మేకింగ్ దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2024 7:41 AM GMT
ప్రభాస్‌ స్పిరిట్‌ డబుల్‌ అప్‌డేట్‌
X

సలార్‌ మరియు కల్కి సినిమాలతో వరుసగా భారీ బ్లాక్‌ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమా సందడి షురూ అయ్యింది.

మరో వైపు సలార్‌ 2 మరియు కల్కి 2 సినిమాలు కూడా మేకింగ్ దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఉండగా యానిమల్ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందబోతున్న స్పిరిట్‌ సినిమా పై అందరి దృష్టి ఉంది.

అర్జున్ రెడ్డి వంటి కల్ట్‌ బోల్డ్‌ యాక్షన్‌ సినిమాను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అదే స్థాయిలో యానిమల్ సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌ దర్శకుల జాబితాలో చేరి పోయాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్‌ ను రెడీ చేసే పనిలో పడ్డాడు.

స్పిరిట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ అధికారికంగా రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ను డబుల్‌ రోల్‌ లో చూపించే విధంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ రెండో పాత్ర ను ఇంటర్వెల్‌ ముందు రివీల్‌ చేస్తారట. రెండో పాత్ర పరిచయం తో సినిమా హైప్ ఒక్కసారిగా పెరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి స్పిరిట్ సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెరిగే విధంగా డబుల్‌ అప్డేట్‌ వచ్చినందుకు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ ను ప్రేక్షకులు చూడని విధంగా స్పిరిట్‌ లో చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఆ విషయమై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ వైల్డ్‌ పాత్ర లో ప్రభాస్‌ ఎలా ఉంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివరి వరకు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 2026 వరకు వెయిట్‌ చేయాల్సిందే.