Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD: లెజెండ్స్‌ని త‌ల‌చి డార్లింగ్ ఎమోష‌న‌ల్

2024 మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `కల్కి 2898 AD` జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

By:  Tupaki Desk   |   23 May 2024 3:59 AM GMT
కల్కి 2898 AD: లెజెండ్స్‌ని త‌ల‌చి డార్లింగ్ ఎమోష‌న‌ల్
X

2024 మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `కల్కి 2898 AD` జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌లోనే టీమ్ ప్ర‌చార హంగామా షురూ అయింది. తాజాగా హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో రొటీన్ కి భిన్నంగా ఎంచుకున్న‌ కాన్సెప్ట్ కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌చార వేదిక‌ను నిర్వ‌హించింది. బుజ్జి అనే రోబో ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. ఈ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసారు. ఈ వేదిక‌పైకి డార్లింగ్ ప్ర‌భాస్ భైర‌వ పాత్ర లుక్ తో వ‌చ్చారు. అత‌డి వేష‌ధార‌ణ కాస్ట్యూమ్ డిజైన్ ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. సినిమాలో తాను డ్రైవ్ చేసే సూప‌ర్ కార్‌లోనే వేదిక‌పైకి రావ‌డం, త‌న స‌హాయ‌కుడైన బుజ్జిని ప‌రిచ‌యం చేయ‌డం.. అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేసింది. నిజంగా భైర‌వ లుక్ తో పాటు సూప‌ర్ కార్ అల్ట్రా స్టైలిష్ డిజైన్ ఎంతో ఆక‌ర్షించింది. అలాగే ఈ వేదిక‌పై సూప‌ర్ కార్ ని బుజ్జిని డిజైన్ చేసిన టీమ్ ని కూడా ప‌రిచ‌యం చేసారు.

అమితాబ్, కమల్ హాసన్‌లపై ప్ర‌శంస‌లు

డార్లింగ్ ప్ర‌భాస్ మునుపెన్న‌డూ లేనంత ఎమోష‌న‌ల్ గా `క‌ల్కి` ప్ర‌చార వేదిక‌పై క‌నిపించాడు. దేశంలోని నటీనటులకు స్పూర్తిగా నిలిచే ఇద్ద‌రు లెజెండ‌రీ న‌టుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన్నారు. ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు ఆ ఇద్ద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌దే పదే త‌న స్పీచ్ లో వారి పేర్ల‌ను ప్ర‌స్థావిస్తూ వారికి థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లపై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు. అమితాబ్ స్ఫూర్తి ద‌క్షిణాదిన ఎంత‌గానో ఉంద‌ని అన్నారు. చాలా మంది సౌత్ తార‌లు ఆయ‌న‌కు అభిమానులు అని అన్నారు. అలాగే త‌న చిన్న‌ప్పుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన `సాగ‌ర సంగ‌మం` చూసి నాకు అలాంటి డ్రెస్ కావాల‌ని త‌న త‌ల్లిని అడిగాన‌ని ప్ర‌భాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో దీపికా పదుకొనే, దిశా పటానీల‌పైనా ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించారు.

అతి భారీ వేదిక‌:

నిజానికి ప్ర‌భాస్ న‌టించిన గ‌త చిత్రాలు సాహో, రాధే శ్యామ్ ల‌కు భారీ వేదిక‌ల‌ను నిర్మించి ప్ర‌చారం చేసారు. కానీ వాట‌న్నిటినీ మించి సువిశాల‌మైన స్థ‌లంలో అత్యంత భారీగా నిర్మించిన వేదిక‌పై క‌ల్కి నుంచి `బుజ్జి రోబో` పాత్ర‌ను ప‌రిచ‌యం చేసారు. వేదిక కోసం ఉప‌యోగించిన లైటింగ్ సిస్ట‌మ్, ఎల‌క్ట్రానిక్ డిస్ ప్లే స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. న‌గ‌రానికి దూరంగా రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి డార్లింగ్ అభిమానులు త‌ర‌లి వచ్చారు. ఈ వేదిక‌పై సూప‌ర్ కార్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అశ్వ‌నిద‌త్, ప్రియాంక ద‌త్ స‌హా చిత్ర‌బృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది.