Begin typing your search above and press return to search.

ప్రభాస్.. 'ఫౌజీ' వేటకు సిద్ధం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ చూశాడు.

By:  Tupaki Desk   |   27 July 2024 7:18 AM GMT
ప్రభాస్.. ఫౌజీ వేటకు సిద్ధం!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ చూశాడు. "కల్కి 2898 AD" బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించి, 1000+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సక్సెస్ ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులకు మంచి బూస్ట్ అందించింది. ముఖ్యంగా, "రాజా సాబ్", "సలార్ 2", "స్పిరిట్" వంటి చిత్రాలతో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం "ఫౌజీ" మీద ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది.

ఇంతవరకు "ఫౌజీ" అనే టైటిల్ తో బజ్ క్రియేట్ అవుతున్న ఈ సినిమాను "సీతా రామం" దర్శకుడు హను రాఘవపూడి సరికొత్త స్టోరీ లైన్ తో డిజైన్ చేయనున్నాడు. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని విషయంలో అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. అసలైతే గత నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి ప్లాన్ మారింది. ఇక ప్రభాస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు.

ఇక ఆగస్టు 22న సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇది దర్శకుడికి, హీరోకు ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. హీరోయిజం ఏమోషన్ ను కరెక్టుగా అందించే కలయిక కావడంతో అంచనాలు ఆకాశాన్నీ దాటేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ దేశభక్తి చిత్రం 40వ దశకంలో భారత సైన్యాన్ని ప్రధానంగా చూపించనుంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నారు.

ఇక చిత్రంలో హీరోయిన్ గా పాకిస్థానీ నటి సజల్ అలీను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. కానీ, మరికొందరు మాత్రం మృణాల్ ఠాకూర్ లేదా రష్మికా మందన్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ ఇద్దరు నటీమణులకు కూడా డేట్స్ ఉన్నాయి కాబట్టి, చివరికి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

ఇది కాకుండా ప్రభాస్ "రాజా సాబ్" చిత్రం షూటింగ్ ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించనున్నారు. అలాగే, "సలార్ 2" కూడా లైన్లో ఉంది. ఈ విధంగా, ప్రభాస్ వరుసగా పలు ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టి, తన కెరీర్ లో మరిన్ని భారీ విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు. "కల్కి 2898 AD" విజయం ప్రభాస్ కు మరింత ఉత్సాహాన్ని అందిస్తూ, అభిమానుల అంచనాలను మరింత పెంచింది.