Begin typing your search above and press return to search.

కల్కి.. ఆ హీరో పాత్రపై మరో లీక్

ఇక దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్ బ్యూటీలు కూడా ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 1:25 PM GMT
కల్కి.. ఆ హీరో పాత్రపై మరో లీక్
X

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898AD" కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ పురాణాల స్ఫూర్తితో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ క్యారెక్టర్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్ బ్యూటీలు కూడా ఉన్నారు.

కల్కి సినిమాలో ఇలా స్టార్ట్ క్యాస్ట్ తోనే దర్శకుడు మంచి కిక్ ఇస్తాడని తెలుస్తోంది. ఇంతకుముందు నాగ్ అశ్విన్ తో వర్క్ చేసిన చాలామంది కల్కి సినిమాలో బాగా అవుతుండడం విశేషం. కీర్తి సురేష్ బుజ్జి అనే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడని టాక్ ఇదివరకే వచ్చింది. ఈ ఇద్దరు మహానటి ద్వారా మంచి క్రేజ్ అందుకున్నారు.

మరొక ప్రధాన పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే చాలా రకాల కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే అతను పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంలో మరొక కొత్త టాక్ వైరల్ అయ్యింది. మహాభారతంలో అర్జునుడి పాత్రను పోలి ఉండేలా విజయ్ పాత్రను తీర్చిదిదినట్లు టాక్. ఈ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట.

అయితే, ఇది గెస్ట్ రోల్ కాదని, పూర్తి నిడివి కలిగిన పాత్రగా ఉంటుందని సమాచారం. విజయ్ దేవరకొండ పాత్ర కథలో ప్రధాన పాత్రగా మారి కథనానికి కొత్త ఊపు తీసుకురానుందట. ఈ సినిమా నేపథ్యం పురాణాలను ఆధారంగా తీసుకొని సైన్స్‌ ఫిక్షన్‌ కలిపి ఉండటంతో అందరిలోను ఎంతో ఉత్సాహం నెలకొంది. దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అతని పాత్ర కూడా పురాణాలకు సంబంధించినదిగా ఉండే అవకాశం ఉంది.

"కల్కి" సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ కూడా రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధమైంది. ట్రైలర్ ద్వారా సినిమా కథ, కథనాలు గురించి మరింత హైలెట్ అవుతున్నాయి. "కల్కి" సినిమా కోసం నాగ్ అశ్విన్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథలో పురాణాలను జోడించడం ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. "కల్కి" ప్రమోషన్స్ ద్వారా ఈ సినిమా కథకు సంబంధించిన వివరాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.