Begin typing your search above and press return to search.

ఈ సారి టఫ్ ఫైట్ తప్పదు ప్రభాస్..

ఆదిపురుష్ కూడా డిజాస్టర్ టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ ని హిందీ బెల్ట్ లో సాధించింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 5:30 PM GMT
ఈ సారి టఫ్ ఫైట్ తప్పదు ప్రభాస్..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకి తెలుగు తర్వాత అత్యధిక ఆదాయం వచ్చేది హిందీలోనే. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు. సాహో మూవీ తెలుగులో డిజాస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లని అందుకుంది. ఆదిపురుష్ కూడా డిజాస్టర్ టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ ని హిందీ బెల్ట్ లో సాధించింది.

అలాగే సలార్, తాజాగా కల్కి 2898ఏడీ సినిమాలకి నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లు మూవీ ఓవరాల్ గా కలెక్షన్స్ లో ఎంత ఇంపాక్ట్ చేశాయో అందరికి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ 600+ కోట్లకి పెరగడానికి నార్త్ ఇండియాలో అతని సినిమాలకి వస్తోన్న ఆదరణ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ కల్కిలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ని జోకర్ తో పోల్చుతూ కామెంట్స్ చేశారు.

ఈ కామెంట్స్ బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ గొడవకి కారణం అయ్యాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ వార్సీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని వేల్యూ ప్రభాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తోన్న ట్రోలింగ్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు తిరిగి కౌంటర్స్ వేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ది రాజాసాబ్ కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

అర్షద్ వార్సీ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ భరించలేక కామెంట్స్ ఆఫ్ చేసేసారు. అయిన కూడా అతనిపై దాడి ఆపడం లేదు. 2025 ఏప్రిల్ 10న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అదే రోజు అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ హిట్ ఫ్రాంచైజ్ జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

సోషల్ మీడియా వార్ కారణంగా ది రాజాసాబ్ మూవీ నార్త్ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో అనే భయం అందరిలో నెలకొంది. ప్రభాస్ సినిమాలలో అతి తక్కువ బజ్ ది రాజాసాబ్ మీద ఉంది. అది కూడా ఈ చిత్రానికి కొంత నెగిటివ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వార్ ని ది రాజాసాబ్ టీమ్ ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.