Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తీరిపోయింది

కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ కూడా ట్రోల్స్‌కు దారి తీశాయి.

By:  Tupaki Desk   |   20 Jun 2024 9:44 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ తీరిపోయింది
X

బాహుబలి సినిమాలో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో అలా కనిపించాడు రెబల్ స్టార్. శివుడి పాత్రలోనూ తన లుక్స్ వావ్ అనిపించాయి. ఐతే రాజమౌళి కోసం ఎంతో కష్ట పడి బాడీ పెంచి, మంచి లుక్ మెయింటైన్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత గాడి తప్పాడు. అన్నేళ్ల కష్టం తర్వాత రిలాక్స్ అయిపోయి మెయింటైనెన్స్ తగ్గించేశాడో ఏమో కానీ.. తర్వాత నటించిన నాలుగు చిత్రాల్లో వేటిలోనూ తన లుక్ అభిమానులకు సంతృప్తినివ్వలేదు.

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ఎంతగా కౌంటర్లు ఇచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ హీరో లుక్స్ విషయంలో అసంతృప్తికి గురయ్యారన్నది వాస్తవం. కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ కూడా ట్రోల్స్‌కు దారి తీశాయి.

ఐతే ‘సలార్’ సినిమాలో కొంచెం బెటర్ లుక్‌తో కనిపించిన ప్రభాస్.. ‘కల్కి’లో ఇంకా మెరుగ్గా దర్శనమిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ముంగిట ముంబయిలో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ‘బాహుబలి’ టైం తర్వాత ప్రభాస్ బెస్ట్ లుక్ ఇదే అని చెప్పొచ్చు. ముఖంలో మునుపటి గ్లో, ఛార్మ్ వచ్చింది. మనిషి బరువు తగ్గి ఫిట్‌గా తయారయ్యాడు.

ట్రెండీ హేర్ స్టైల్, ఓవరాల్ లుక్‌తో ప్రభాస్ సూపర్ హ్యాండ్సమ్‌గా కనిపించి అభిమానుల మనసు దోచాడు. ఈ మేకోవర్ బహుశా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజా సాబ్’ కోసం అయ్యుండొచ్చు. లేదా ప్రభాస్ మామూలుగానే కొంచెం కేర్ తీసుకుని బెటర్ లుక్‌లోకి మారే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కారణం ఏదైనా.. ప్రభాస్ ఇలాంటి ఛార్మింగ్ లుక్‌లోకి రావడం మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిస్తోంది.