Begin typing your search above and press return to search.

దీనికేనా ప్రభాస్‌ ఫ్యాన్స్ భయపడింది?

అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్ ని అంతగా భయపెట్టిన వ్యాక్సిన్‌ వార్‌ సినిమా కి డిజాస్టర్ టాక్ వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 8:35 AM GMT
దీనికేనా ప్రభాస్‌ ఫ్యాన్స్ భయపడింది?
X

ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ సినిమాను గత వారం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. సెప్టెంబర్‌ చివరి వారంలో సలార్‌ ను తీసుకు వచ్చి తీరుతాం అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల సలార్‌ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేయడం జరిగింది.

సెప్టెంబర్‌ లో సలార్‌ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సమయంలోనే వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన 'ది వ్యాక్సిన్‌ వార్‌' సినిమాను అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రభాస్ గత చిత్రం రాధేశ్యామ్‌ విడుదల అయిన రోజే వివేక్‌ అగ్నిహోత్రి గత చిత్రం కాశ్మీర్ ఫైల్స్ విడుదల అవ్వడం అందరికి తెల్సిందే.

రాధేశ్యామ్‌ సినిమా పై పూర్తి స్థాయి ఆధిపత్యం ను కాశ్మీర్ ఫైల్స్ చూపించడం జరిగింది. దాంతో సలార్‌ విషయంలో కూడా అదే జరుగుతుందేమో అని ప్రభాస్ అభిమానులు భయపడ్డారు. వివేక్‌ అగ్నిహోత్రి కావాలని ప్రభాస్ సినిమాకు పోటీగా తన వ్యాక్సిన్‌ వార్‌ సినిమాను విడుదల చేయాలి అనుకోవడం విడ్డూరంగా ఉందని కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

వ్యాక్సిన్ వార్‌ సినిమా తో పోటీ వద్దని ప్రభాస్ అభిమానులు కొందరు ప్రశాంత్ నీల్‌ కి సూచించడం కూడా జరిగిందట. కారనం ఏదైతేనేం వ్యాక్సిన్‌ వార్‌ సినిమా వచ్చిన సమయంకు సలార్ సినిమా రాలేదు. అయితే ప్రభాస్‌ ఫ్యాన్స్ ని అంతగా భయపెట్టిన వ్యాక్సిన్‌ వార్‌ సినిమా కి డిజాస్టర్ టాక్ వచ్చింది.

గత చిత్రం కాశ్మీర్ ఫైల్స్ ఫలితం నేపథ్యం లో వ్యాక్సిన్ వార్‌ పై సినీ ప్రేమికులు కాస్త ఎక్కువ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఒక వర్గం వారిని, ఒక రాజకీయ పార్టీని మోస్తున్నట్లు వ్యాక్సిన్ వార్ సినిమా ఉండటంతో ప్రేక్షకులు తిరస్కరించారు.

అన్ని సార్లు అద్భుతాలు ఆవిష్కారం కావు అని దీంతో మళ్లీ నిరూపితం అయింది. సలార్‌ తో కలిసి వ్యాక్సిన్‌ వార్‌ వచ్చి ఉంటే ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చేవి కాదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.