Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తో ఊచకోత కోయించు ప్లీజ్‌..!

ఈ సమయంలో సందీప్‌ వంగ కి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 5:09 AM GMT
ప్రభాస్‌ తో ఊచకోత కోయించు ప్లీజ్‌..!
X

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాహుబలి 2 తర్వాత సాలిడ్ హిట్‌ ను అందుకోలేదు. ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు ప్రభాస్ హిట్ కొడతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న సలార్‌ సినిమా తో కచ్చితంగా ప్రభాస్ ఆ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సలార్‌ లో ప్రభాస్ యాక్షన్‌ సన్నివేశాలు దుమ్ములేపే విధంగా ఉంటాయి అంటూ ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతోంది. ప్రభాస్ కి అలాంటి పాత్రలు, కథలు అయితేనే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ తర్వాత ప్రభాస్‌ సినిమా సందీప్ వంగ దర్శకత్వంలో అనే విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఒక పవర్‌ ఫుల్‌ కాప్‌ స్టోరీతో స్పిరిట్‌ అనే సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా లో ప్రభాస్ ఎలా ఉంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో సందీప్‌ వంగ కి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా రిక్వెస్ట్‌ చేస్తున్నారు. యానిమల్‌ సినిమాలో ఎలా అయితే రణబీర్‌ కపూర్‌ ను చాలా అగ్రెసివ్‌ గా చూపించారో అలాగే స్పిరిట్ లో కూడా హీరో ను చూపించండి.. అంతకు మించి ప్రభాస్‌ తో ఊచకోత కోయించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి, ఆయన ఫిజిక్ కి యాక్షన్‌ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే ప్రభాస్ తో అంతకు మించి అన్నట్లుగా సలార్ లో యాక్షన్‌ చేయించారు. కనుక స్పిరిట్‌ లో కూడా ప్రభాస్ ను ఉపయోగించుకోవాలని సందీప్‌ వంగ కి ఫ్యాన్స్‌ ముందు నుంచే సూచిస్తున్నారు. మరి సందీప్‌ వంగ ఏం చేస్తాడో చూడాలి.