Begin typing your search above and press return to search.

మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్.. ఏ రోల్ అంటే..

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భక్త కన్నప్ప కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2023 5:33 AM GMT
మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్.. ఏ రోల్ అంటే..
X

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భక్త కన్నప్ప కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా సోషల్ మీడియా ట్విట్టర్ లో కన్ఫామ్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. దీనిపై మంచు విష్ణు హర హర మహాదేవ్‌ అంటూ రాసుకొచ్చారు. ఇక ఇది చూసిన సినీ ప్రియులు, అభిమానులు.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్‌ శివుడిగా కనిపించనున్నారంటూ ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్‌ను మూడోసారి దేవుడి పాత్రలో చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కినట్టవుతుంది. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్‌లో రాముడిగా కనిపించి మెప్పించారు. కల్కిలోనూ విష్ణుమూర్తిగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

విష్ణు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ భక్త కన్నప్ప సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ అది ఈ మధ్యే కుదిరింది. ఆగస్టులో పట్టాలెక్కించారు. నుపుర్‌ సనన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేయడం వీలుకాదని, దీనికోసం న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నట్లు మంచు విష్ణు సినిమా ప్రారంభంలో తెలిపారు.

కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు విష్ణు తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను సిద్ధం చేస్తునట్లు పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ కథకు కావాల్సిన మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.150కోట్లు బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.