అయోధ్యకు వెళ్లే ముందు ప్రభాస్ ఏంటి ఇలా?
డార్లింగ్ ప్రభాస్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే సినీప్రముఖుల్లో ఒకడు.
By: Tupaki Desk | 13 Jan 2024 4:05 AM GMTడార్లింగ్ ప్రభాస్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే సినీప్రముఖుల్లో ఒకడు. ఈనెల 22న రామమందిర ప్రారంభోత్సవంలో చిరంజీవి, అమితాబ్, రణబీర్ సహా ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి, ఆలయ నిర్వాహకుల నుంచి ప్రభాస్ కి ఆహ్వానం అందినట్టు మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి.
అయితే ఇంతలోనే ప్రభాస్ చేసిన ఈ పని అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రభాస్ ఏం చేసాడు? అంటే.. అయోధ్య రామయ్య దర్శనానికి ముందే కర్నాటక- మంగళూరులోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించాడు. ప్రభాస్ వైట్ హుడీ ధరించి, తలకు తెలుపురంగు మాస్క్ ని ధరించి గుడిలోకి ప్రవేశించాడు. అతడి వెంట గార్డ్ లు ఉన్నారు. ఈ సందర్శనలో ప్రభాస్ తో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత కిరంగదూర్ తదితరులు ఉన్నారు. ఆకస్మికంగా ఇలా అమ్మవారి దర్శనానికి వెళ్లడానికి అసలు కారణమేమిటి? అన్నది అభిమానులు ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.
ప్రభాస్ ఇటీవల అసలు మీడియాలోనే పెద్దగా కనిపించలేదు. సలార్ రిలీజ్ ముందు ఏదో ఒక ఇంటర్వ్యూలో కనిపించిన డార్లింగ్, ఆ తర్వాత సక్సెస్ మీట్ లో కనిపించాడు. మధ్యలో ఇక కనిపించింది లేదు. దీంతో ఫ్యాన్స్ అతడి గురించి ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు.
డిసెంబర్ 2023లో విడుదలైన సాలార్: పార్ట్ 1-సీజ్ ఫైర్ అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు నటించారు. సలార్ విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా నిలిచింది. షారూఖ్ డంకీని రేసులో వెనక్కి నెట్టాడు డార్లింగ్. సలార్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదూర్ కర్ణాటకలోని మంగళూరులోని శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి తమ మొక్కును దర్శకనిర్మాతలు తీర్చుకున్నారు. తదుపరి రామ మందిర ప్రారంభోత్సవంలో ప్రభాస్ ని మరోసారి వీక్షించేందుకు ఆస్కారం ఉంది.