Begin typing your search above and press return to search.

ప్రభాస్ - హను.. మొదలెట్టేశారు!

ప్రభాస్‌ అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్‌ రాబోతోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" తో భారీ హిట్‌ కొట్టిన ప్రభాస్‌ తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్‌ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 6:40 AM GMT
ప్రభాస్ - హను.. మొదలెట్టేశారు!
X

ప్రభాస్‌ అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్‌ రాబోతోంది. ఇప్పటికే "కల్కి 2898 AD" తో భారీ హిట్‌ కొట్టిన ప్రభాస్‌ తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్‌ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పుడు, ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో "ది రాజా సాబ్" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా. అలాగే తదుపరి0ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా రెడీ అవుతోంద.

టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ పూజా కార్యక్రమం ఆగష్టు 17న జరగనుందని, సెప్టెంబర్ 21న తమిళనాడులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని మొన్నటివరకు చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక అనుకున్నట్లే నేడు మేకర్స్ పూజా కార్యక్రమాలతో ప్రాజెక్టును లాంచ్ చేశారు. అయితే, అధికారిక సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలలో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ లో చాలా కూల్ గా దర్శనమిచ్చాడు.

ఇక ఈ సినిమా ఒక పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉన్న కథతో, ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు "ఫౌజీ" అనే వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తుందని మొదట టాక్ వచ్చింది. అయితే తాను నటించడం లేదని ఆమెనే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమా, భారీ బడ్జెట్‌ తో రూపుదిద్దుకోనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సుదీప్‌ చట్టర్జీ ఈ చిత్రానికి కెమెరామెన్ గా వర్క్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూజా రోజునే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయనున్నారని కూడా టాక్‌ అయితే వచ్చింది. ఇక ఆ సమయం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇది ప్రభాస్‌ అభిమానులకు మరో బిగ్ సర్‌ప్రైజ్ అవుతుందనే అనుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్‌ లుక్, ఆయన పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. "కల్కి" వంటి విజయం తరువాత, అభిమానులు ప్రభాస్‌ నుంచి మరింత కొత్తదనం, వైవిధ్యం కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ అలాంటి ఎలిమెంట్స్‌తో కూడి ఉండనుందనేది త్వరలోనే తెలుస్తుంది. ఇది ప్రభాస్‌ కెరీర్‌లో మరో బిగ్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.