Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ షాక్ తినే వార్త‌

దర్శకుడు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ మ‌ధ్య‌ సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన‌ట్టేన‌ని గుస‌గుస వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   26 May 2024 4:21 AM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ షాక్ తినే వార్త‌
X

ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో రానున్న 'స‌లార్ 2'పై భారీ అంచ‌నాలున్నాయి. మొద‌టి భాగం సుమారు 600 కోట్లు వసూలు చేయ‌డంతో ఇప్పుడు రెండో భాగం 1000 కోట్లు పైగా సునాయాసంగా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా ఉంది. ఈ సీక్వెల్ మూవీ కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. 'స‌లార్'ని మించి స‌లార్‌- 2లో కేజీఎఫ్ 2 త‌రహాలో ప్ర‌భాస్ లోని బీస్ట్ ని, అత‌డి భారీ యాక్ష‌న్ ని వీక్షించ‌బోతున్నామ‌ని అభిమానులు ఉత్కంఠ‌గా ఉన్నారు. కానీ ఇలాంటి వారంద‌రికీ ఇది షాకింగ్ వార్త‌.

స‌లార్ ఘ‌న‌విజ‌యం సాధించిన నేప‌థ్యంలో 'స‌లార్ 2' మ‌రింత భారీ స్కేల్ పై వ‌స్తుంద‌న్న భావ‌న‌లో ఉన్నవారికి నిజంగానే ఇది ఝ‌ల‌క్. అస‌లింత‌కీ ఏమైంది.. స‌లార్ 2 ఉంటుందా ఉండ‌దా? అంటే.. ఫిలింస‌ర్కిల్స్ లో ఒక సెక్ష‌న్ 'స‌లార్ 2' ర‌ద్ద‌యిన‌ట్టేన‌ని గుస‌గుస‌లాడుతోంది. ఫిల్మ్ న‌గ‌ర్‌ గాసిప్ ప్ర‌కారం.. ప్ర‌భాస్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో సెట్స్ పైకి వెళ్లాల్సిన‌ 'స‌లార్ 2' నిలిచిపోయింది. ఇది ఎప్ప‌టికీ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌దు అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ - ప్రభాస్ మ‌ధ్య‌ సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన‌ట్టేన‌ని గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న రాజా సాబ్ త‌ర్వాత స‌లార్ 2 కాకుండా మరో చిత్రాన్ని ప్రారంభించాలని ప్ర‌భాస్ భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికి 'సలార్ 2'ను పక్కన పెట్టాలని ప్రభాస్ నిర్ణయించార‌నేది టాక్. అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేనప్పటికీ, ఈ వార్త అంతటా వైరల్ అవుతోంది. దీంతో ప్ర‌భాస్ అభిమానులు షాక్ లో ఉన్నారు. హోంబేల్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో కిరంగ‌దూర్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీలక పాత్రలలో న‌టిస్తున్నారు. ఇవేవీ అధికారిక వార్త‌లు కావు. తాజా పుకార్ల‌పై చిత్ర‌బృందం ఇంకా స్పందించాల్సి ఉంది.