ప్రభాస్.. స్టార్స్ హీరోయిన్స్ లేకుండానే..
స్క్రిప్ట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే క్యాస్టింగ్ విషయంలో కూడా అతని రేంజ్ కు తగ్గట్టుగా నటీనటులను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది
By: Tupaki Desk | 21 Aug 2024 9:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ప్రాజెక్టు సెట్ చేయడం అంత ఈజీ కాదు. స్క్రిప్ట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే క్యాస్టింగ్ విషయంలో కూడా అతని రేంజ్ కు తగ్గట్టుగా నటీనటులను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సలార్, కల్కి వరకు ప్రభాస్ పక్కన స్టార్ హీరోయిన్లను మాత్రమే తీసుకున్నా, ఆ తర్వాతి నుంచి సినిమాల్లో పెద్దగా స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయెల్ అనే యువ డ్యాన్సర్ ని తీసుకున్నారు. ఇమాన్వి తన డ్యాన్స్ టాలెంట్ ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయినా, మెయిన్ స్ట్రీమ్ సినీ రంగానికి పెద్దగా పరిచయం లేదు. 1940ల వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ - ఇమాన్వి జంటను ఎలా ఆదరిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దీని తరవాత మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్ కోసం కూడా ఇదే తరహాలో ఆలోచించారు. ఇందులో రిద్దికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి పెద్దగా స్టార్ డమ్ లేని హీరోయిన్లను తీసుకున్నారు. వీరిలో తెలుగు పరిశ్రమకు అంతగా పరిచయం లేని హీరోయిన్లు ఉండటం విశేషం.
ప్రభాస్ తాజా చిత్రాల్లో హీరోయిన్ల ఎంపికపై పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. స్టార్ హీరోయిన్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనుక ఉన్న కారణాలు వేరు. ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువ స్క్రీన్ టైం ఉండవు. న్యూ కమర్స్ ను ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమాలకు ఫ్రెష్‌నెస్ తీసుకొస్తుందని భావిస్తున్నారు.
ఫ్రెష్ ఫేసెస్ వల్ల సినిమాకు ఓవర్ హైప్ లేకుండా, కధపరమైన ఫోకస్ ఎక్కువ ఉంటుందని కూడా మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగే పరిశ్రమలో ఉన్న పెద్ద హీరోయిన్లు బాలీవుడ్, తమిళ పరిశ్రమల్లో కూడా బిజీగా ఉండటం వల్ల వారి అందుబాటులో ఉండకపోవడం కూడా ప్రభాస్ ఇలా కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి కారణమని చెప్పొచ్చు.
ప్రభాస్ సినిమాల్లో నటించే కొత్త హీరోయిన్స్ కి ఇది మంచి అవకాశం కావడం విశేషం. ఇలా ప్రభాస్ లాంటి స్టార్ పక్కన నటించడం ఆ హీరోయిన్స్ కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతుంది. మరి, ప్రభాస్ ఇదే ఫార్ములాతో తన రాబోయే సినిమాల్లో కూడా ఫ్రెష్ ఫేసెస్ ని ఎంచుకుంటాడా? లేక మళ్ళీ స్టార్ హీరోయిన్లకు అవకాశం ఇస్తాడా? అనేది చూడాలి.