Begin typing your search above and press return to search.

హై వోల్టేజ్ సీన్.. ప్రభాస్ డబుల్ ట్రీట్!

కానీ ఇప్పుడు సలార్ సినిమా విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ ఇద్దరు ప్రభాస్ లను ఒకేసారి చూపించబోతున్నాడు

By:  Tupaki Desk   |   20 Aug 2023 1:30 AM GMT
హై వోల్టేజ్ సీన్.. ప్రభాస్ డబుల్ ట్రీట్!
X

ప్రభాస్ ఈసారి సలార్ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్న ప్రభాస్ ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇక సినిమాకు సంబంధించిన చాలా రకాల గాసిప్స్ కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈపాటికి ఫస్ట్ సాంగ్ కూడా విడుదల కావాలి. కానీ చిత్ర యూనిట్ ప్రస్తుతం ట్రైలర్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాన్ని పర్ఫెక్ట్ గా కట్ చేసి త్వరలోనే వదలాలని అనుకుంటుంది.

ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం కూడా వైరల్ అవుతుంది. సినిమాలో ప్రభాస్ డబుల్ యాక్షన్ అని ఇదివరకే ఒక బలమైన టాక్ అయితే వినిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి కొడుకులు గా కనిపిస్తారని కూడా కొంత క్లారిటీ వచ్చింది. ప్రభాస్ ఇప్పటివరకు డబుల్ రోల్స్ చేశాడు కానీ ఒకేసారి ఫ్రేమ్ లో మాత్రం రెండు పాత్రలతో అయితే కనిపించలేదు.

బిల్లా సినిమాలో డబుల్ యాక్షన్, అలాగే బాహుబలి సినిమాలో చేసిన రెండు పాత్రలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. కానీ ఒకేసారి ఫ్రేమ్లో మాత్రం రెండు క్యారెక్టర్స్ కనిపించలేదు. కానీ ఇప్పుడు సలార్ సినిమా విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ ఇద్దరు ప్రభాస్ లను ఒకేసారి చూపించబోతున్నాడు. అది కూడా హై వోల్టేజ్ సన్నివేశంలో ఆ రెండు పాత్రలు హైలెట్ అవుతాయని తెలుస్తోంది.

ఒక వెయ్యి మంది రౌడీలు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ డౌన్ ఫాల్ అవుతుందట. ఇక అప్పుడు మరొక ప్రభాస్ క్యారెక్టర్ వచ్చి ఆ యుద్ధంలో భీకరంగా పోరాడుతాడట. ఇంతకు తండ్రిని కొడుకు కాపాడతాడా? లేదా కొడుకు తండ్రికి సహాయం చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ తప్పకుండా ఒకే ఫ్రేమ్ లో మాత్రం ఇద్దరూ ప్రభాస్ లు ఊచకోత కోయడం పక్కా అని తెలుస్తోంది. మరి ఆ సన్నివేశం వెండితెరపై ఏ విధంగా ఉంటుందో చూడాలి.