Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఇచ్చి పడేశాడు!

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   15 July 2024 11:22 AM GMT
ప్రభాస్.. ఇచ్చి పడేశాడు!
X

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా ఉన్నాడు. అతనితో సినిమా అంటే నిర్మాతలు 300-500 వరకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. అలాగే దర్శకులు కూడా లార్జర్ దెన్ లైఫ్ కథలని సిద్ధం చేసుకొని ప్రభాస్ తో మూవీస్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. అయిన కూడా ప్రభాస్ డేట్స్ దొరకని పరిస్థితి. ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ లెవల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ కి ఈ ఇమేజ్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు.

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవల్ లో డార్లింగ్ ప్రభాస్ సక్సెస్ అయ్యారు. బాలీవుడ్ స్టార్స్ కి కూడా సాధ్యం కానీ రికార్డులని డార్లింగ్ ప్రభాస్ అందుకుంటున్నాడు. ఓవర్సీస్ మార్కెట్ లో తిరుగులేని రారాజుగా ఉన్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో మూవీ కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. దీంతో కేవలం వన్ మూవీ వండర్ అనే విమర్శలు వచ్చాయి. తరువాత చేసిన రాధేశ్యామ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.

అస్సలు సెట్ కాని కథని వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఎందుకు తీశారని విమర్శించారు. అదే సమయంలో ప్రభాస్ లుక్ మీద కూడా కామెంట్స్ వచ్చాయి. హిందీలో చేసిన ఆదిపురుష్ మూవీ అయితే ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ అస్సలు బాగోలేదని సినీ విమర్శకులు సైతం కామెంట్స్ చేశారు. అతని లుక్, ఆహార్యం అన్నింటి మీద కామెంట్స్ చేయడమే కాకుండా బాలీవుడ్ లో ఒక వర్గం మీమ్స్ క్రియేట్ చేసి ప్రభాస్ ని అవమానించారు. అయితే సోషల్ మీడియాలో తనపైన ఎలాంటి విమర్శలు వచ్చిన ఏ రోజు డార్లింగ్ వాటిని వ్యతిరేకించలేదు. కేవలం సక్సెస్ తోనే ఇచ్చి పడేశాడు అని చెప్పవచ్చు.

2023 ఆఖరులో సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని మాస్ కటౌట్ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్నాడు. ఆ సినిమాలో పవర్ ఫుల్ దేవ పాత్రలో ఒక డైనోసార్ ని ఆడియన్స్ చూసారు. ఇక కల్కి 2898ఏడీ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకున్నారు. సలార్ మూవీ 700+ కోట్లు సాధిస్తే కల్కి 1000 కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ రెండో సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ లుక్స్ అందరిని ఎట్రాక్ట్ చేసాయి.

బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్స్ అందుకొని డార్లింగ్ ప్రభాస్ సగర్వంగా తన స్టామినా ఏంటనేది అందరికి సమాధానం చెప్పాడు. విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా చేసాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అతని లుక్స్ అవుట్ అయిపోయాయని విమర్శించిన అందరికి మరల అధిరిపోయే కమ్ బ్యాక్ తో ఆన్సర్ చేసాడు. ఇక నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే సినిమాలలో రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అయిపోయిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. స్పిరిట్ కూడా 1000+ కోట్లు కలెక్ట్ చేస్తే ఇండియన్ నెంబర్ 1 హీరోగా ప్రభాస్ రేంజ్ ని ఏ ఒక్క హీరో కూడా అందుకోలేరని ప్రశంసిస్తున్నారు.