Begin typing your search above and press return to search.

'కల్కి' కి ప్రభాస్‌ నిజంగా తీసుకున్నది ఎంత...?

ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు సగటు ఇండియన్‌ సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'.

By:  Tupaki Desk   |   22 Jun 2024 6:32 AM GMT
కల్కి కి ప్రభాస్‌ నిజంగా తీసుకున్నది ఎంత...?
X

ప్రభాస్‌ ఫ్యాన్స్ తో పాటు సగటు ఇండియన్‌ సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా రూ.600 కోట్లతో రూపొందింది.

కల్కి ప్రమోషన్ ఖర్చు, ఇతర మొత్తం ఖర్చులు కలుపుకు రూ.650 కోట్ల వరకు బడ్జెట్‌ ను నిర్మాత అశ్వినీదత్‌ కేటాయించాడనే వార్తలు వస్తున్నాయి. గ్రాఫిక్స్ తో పాటు విదేశీ టెక్నీషియన్స్ తో ఈ సినిమాకు వర్క్‌ చేయించినందుకు గాను భారీ మొత్తంలో ఖర్చు చేయడం జరిగిందట.

చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్‌ సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో నటించినందుకు గాను రూ.150 కోట్ల పారితోషికం ను అందుకున్నాడట. ఇది ప్రభాస్ గత చిత్రం 'సలార్‌' కంటే ఎక్కువ. కల్కి కోసం దాదాపు రెండేళ్ల పాటు ప్రభాస్ కష్టపడ్డాడు.

ప్రభాస్ మార్కెట్‌ వాల్యూ ఈ సినిమాకు కలిసి వస్తుంది. ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అది కేవలం ప్రభాస్ వల్లే అనడంలో సందేహం లేదు. అందుకే ప్రభాస్ కి రూ.150 కోట్ల పారితోషికం అనేది నార్మల్‌ విషయంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాల లాభాల్లో వాటాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రభాస్ కల్కి విషయంలో అలాంటి వాటాని ఏమీ మాట్లాడుకోలేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన పారితోషికం కాకుండా లాభాల్లో వాటాను అందుకునే అవకాశం లేదు అంటున్నారు.

నిర్మాత అశ్వినీదత్‌ కి వందల కోట్ల లాభాలు వస్తే అప్పుడు ఏమైనా ప్రభాస్ కి అదనంగా పారితోషికం ఇస్తాడా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి అయితే కల్కి కోసం ప్రభాస్‌ నిజంగా తీసుకున్న పారితోషికం మాత్రం రూ.150 కోట్లుగా ప్రచారం జరుగుతోంది.