Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో ఇమాన్వి.. ఆమె స్పెషల్ టాలెంట్ ఏమిటంటే..

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమాలో నటిస్తుండగా, మరో ప్రాజెక్ట్‌ను హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 1:30 PM GMT
ప్రభాస్ తో ఇమాన్వి.. ఆమె స్పెషల్ టాలెంట్ ఏమిటంటే..
X

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సలార్ మరియు కల్కి వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రభాస్ కెరీర్‌కు మంచి ఊపునిచ్చాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రభాస్‌ను బాక్సాఫీస్ స్టామినాను ట్రాక్ లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమాలో నటిస్తుండగా, మరో ప్రాజెక్ట్‌ను హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రారంభించారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోయే ఇమాన్ ఎస్మాయిల్ పై ప్రస్తుతం ఫ్యాన్స్‌ లో మంచి ఆసక్తి నెలకొంది. మొదటి చూపులోనే అమ్మడు చీరలో కనిపించి ఎట్రాక్ట్ చేసింది.

ఇమాన్ ఎస్మాయిల్ టాలీవుడ్‌ లో తొలిసారి అడుగుపెడుతోంది, అది కూడా ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో కలిసి నటించడం విశేషం. మేకర్స్ ఆమెను 'ఇమాన్వి' అని పేరుతో పరిచయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇమాన్ అసలు పాకిస్తాన్‌లో పుట్టింది కానీ, ప్రస్తుతం ఢిల్లీలో సెటిల్ అయ్యిందని తెలుస్తోంది.

ఈమె ఒక నటి మాత్రమే కాదు, క్లాసికల్ డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ మంచి గుర్తింపు పొందింది. ఇమాన్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంది, ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ ద్వారా టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతోంది. ఇమాన్ ఎస్మాయిల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

దర్శకుడు హను హీరోయిన్స్ ని ఎంత అందంగా ప్రజెంట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీతారామం సినిమాలో మృణాల్ ను క్లాసిక్ గా ప్రజెంట్ చేశాడు. ఇక ప్రభాస్ సినిమాలో కూడా ఈ అమ్మాయిని మనసుకు హత్తుకునే పాత్రలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అందం ఉంది మంచి డ్యాన్సర్ కావున సినిమాలో క్లాసికల్ టచ్ ను గట్టిగానే హైలెట్ చేసే అవకాశం ఉంది. మంచి టాలెంటెడ్ డ్యాన్సర్ కావున ఆమెకు ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఏమాత్రం క్లిక్కయినా పాన్ ఇండియా క్రేజ్ ఒక్క సినిమాతోనే అందుకోవచ్చు.

ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అనేకమంది ఫాలో చేస్తున్నారు, ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆమె క్యూట్ లుక్స్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టక ముందే ఇమాన్ పేరు ట్రెండింగ్‌లో ఉండటం ఆమెకు మంచి ప్లస్ పాయింట్‌ కానుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్‌లో మరో ముఖ్య ఘట్టంగా నిలిచే అవకాశముంది, మరి ఇమాన్ తన తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.