Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఎందుకీ తలనొప్పి?

అయితే ఇప్పటికే నేషనల్ లెవెల్ లో తనకు ఉన్న క్రేజ్ ను కల్కి తో మరింత పెంచుకున్నారు ప్రభాస్.

By:  Tupaki Desk   |   23 July 2024 6:01 AM GMT
ప్రభాస్.. ఎందుకీ తలనొప్పి?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ సినిమా.. భారీ వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అనేక రికార్డులు బద్దలు కొట్టింది. మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇప్పటికే నేషనల్ లెవెల్ లో తనకు ఉన్న క్రేజ్ ను కల్కి తో మరింత పెంచుకున్నారు ప్రభాస్.

ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఆయన రాజా సాబ్ మూవీతో బిజీగా ఉన్నారు. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీతో తర్వాత హను రాఘవపూడితో డార్లింగ్ వర్క్ చేయనున్నారని టాక్.

ప్రభాస్ తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రొమాంటిక్ సినిమా చేయనున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ తోపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అదే సమయంలో ఆ సినిమాకు గాను పాకిస్తాన్ నటి సెజల్ అలీని హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ మారగా.. అనేక మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నటిని తీసుకోవాల్సిన అవసరమేంటని కొందరు అంటున్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాకు వచ్చిన స్థితి ఏర్పడుతుందని, దయచేసి అలాంటి పనులు చేయొద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. షారుఖ్ రయీస్ మూవీలో పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ హీరోయిన్ గా నటించింది. దీంతో అప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సెజల్ అలీ టాలెంటెడ్ హీరోయిన్ అయినప్పటికీ, ఆమెను తీసుకోవద్దని కోరుతున్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వేరే హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని చెబుతున్నారు. లేకుంటే అనవసరంగా విమర్శలపాలు కావాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సెజల్ అలీ విషయంపై ఇప్పటివరకు హను రాఘవపూడి సహా ఎవరూ స్పందించలేదు. మరి అసలు హను రాఘవపూడి నిజంగానే సెజల్ అలీని సెలెక్ట్ చేశారా? లేక రూమర్సా అనేది తెలియాల్సి ఉంది.