Begin typing your search above and press return to search.

రాజాసాబ్… ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్

ఇదిలా ఉంటే ఈ మూవీ హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోందనే మాట వినిపిస్తోంది కంప్లీట్ గా ఒక ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తుందంట.

By:  Tupaki Desk   |   26 July 2024 1:30 AM GMT
రాజాసాబ్… ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్
X

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ కావడంతో ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ రాబోయే సినిమాపై ఫోకస్ చేస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో డార్లింగ్ రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోందనే మాట వినిపిస్తోంది కంప్లీట్ గా ఒక ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తుందంట.

ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్యాలస్ బ్యాక్ డ్రాప్ లో అయితే కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే సినిమా మొత్తం ప్యాలస్ లోనే ఉంటుందా లేదా అనేది పూర్తిగా తెలియదు. కల్కి మూవీ సక్సెస్ తో ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల విషయంలో ఫ్యాన్స్ లార్జర్ దెన్ లైఫ్ కథలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రాజాసాబ్ మూవీ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తక్కువ బడ్జెట్ తో చేస్తోన్న సినిమా ఇదే అని తెలుస్తోంది.

సుమారు 250 కోట్ల బడ్జెట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రం కోసం ఖర్చు చేస్తోందంట. అందులో 120 కోట్ల వరకు డార్లింగ్ ప్రభాస్ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ ఒక్క డాన్స్ నెంబర్స్ వున్న సాంగ్ చేయలేదు. ఆయన మోకాళ్ళ నొప్పి కారణంగా డాన్స్ సాంగ్స్ ని అవైడ్ చేస్తూ వచ్చారు. డైరెక్టర్స్ కూడా డాన్స్ చేయాల్సిన సాంగ్స్ ని సినిమాలలో పెట్టలేదు.

అయితే ప్రభాస్ మోకాళ్ళ చికిత్స చేసుకొని ఇప్పుడు పెర్ఫెక్ట్ గా రెడీ అయ్యారు. దీంతో రాజాసాబ్ సినిమా కోసం మంచి మాస్ సాంగ్స్ ని కంపోజ్ చేయాలని సూచించారంట. రీసెంట్ గా థమన్ కూడా రాజాసాబ్ మూవీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత ప్రభాస్ అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేయబోతున్నట్లు చెప్పారు. మంచి మాస్ బీట్స్ ని మూవీ కోసం కంపోజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

కచ్చితంగా రాజాసాబ్ సినిమాలోని సాంగ్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ని అలరిస్తాయని అన్నారు. ప్రభాస్ కూడా సాంగ్స్ లో డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఆయన మాటల్లో రివీల్ చేశారు. మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారిద్దరితో కూడా డార్లింగ్ ప్రభాస్ కి మంచి డాన్స్ సాంగ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.