Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో 1000 కోట్లు.. మరో రెండు గ్యారెంటీ

బడా నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2024 12:30 AM GMT
ప్రభాస్ తో 1000 కోట్లు.. మరో రెండు గ్యారెంటీ
X

ఇండియా బాక్సాఫీస్ పై బిగ్ స్టార్ గా ప్రస్తుతం ప్రభాస్ ఉన్నాడు. అతని సినిమాల మార్కెట్ పరంగా కూడా అందరికంటే టాప్ లోనే కొనసాగుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేరు. అలాగే రెమ్యునరేషన్ పరంగా చూసుకున్న అత్యధికంగా అందుకుంటున్న ఇండియన్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. బడా నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ హీరోగా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 725 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇదే స్పీడ్ కొనసాగితే రెండు వారాల్లో వెయ్యి కోట్ల క్లబ్ లో కల్కి మూవీ చేరిపోతుంది. సినిమాకి వస్తోన్న ఆదరణ బట్టి చూస్తుంటే కచ్చితంగా ఆ ఫీట్ ని అందుకుంటుందని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత మరో వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించే సినిమా ఖాతాలో వేసుకోవడానికి ప్రభాస్ చాలా ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది.

సలార్ మూవీ 1000 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. అయితే ఆ మూవీ 600 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే కల్కి మాత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డ్ ని ప్రభాస్ సమం చేయనున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంగతి చూసుకుంటే మరో రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్స్ ప్రభాస్ ఖాతాలో చేరినట్లే చెప్పాలి.

సలార్ మూవీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న సలార్ 2 కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే కల్కి2898ఏడీ మూవీ సక్సెస్ కావడంతో దీనికి కొనసాగింపుగా రానున్న పార్ట్ 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే సినిమా అవుతుందని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఖాతాలో 1000 కోట్ల క్లబ్ సినిమాలుగా చేరితే అతని రికార్డ్ ని ఎవరూ కూడా అందుకోలేరనే మాట వినిపిస్తోంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అతని సినిమాలకి యూత్ లో మంచి ఆదరణ ఉంటుంది. సందీప్ కల్ట్ ఇమేజ్, ప్రభాస్ బ్రాండ్ జతకలిస్తే కచ్చితంగా స్పిరిట్ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.