ప్రభాస్.. రెమ్యునరేషన్ తగ్గించేసి..
కల్కి మూవీ బజ్ ఆల్ మోస్ట్ ఎండ్ అయిపోవడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ ఫోకస్ పెరిగింది.
By: Tupaki Desk | 23 July 2024 3:58 AM GMTయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం కూడా డీసెంట్ వసూళ్లతో ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. కల్కి మూవీ బజ్ ఆల్ మోస్ట్ ఎండ్ అయిపోవడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ ఫోకస్ పెరిగింది. పబ్లిక్ లో కూడా ఆ సినిమాపై చర్చ నడుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 50% మేరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రెడీ అవుతోంది. హర్రర్ కామెడీ కథలు చెప్పడంలో మారుతికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలాగే అతని కామెడీ స్టైల్ కూడా అందరికి నచ్చుతుంది.
ఆయన కెరియర్ లో ఫస్ట్ టైమ్ ఒక స్టార్ హీరోని డీల్ చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ రెమ్యూనరేషన్ గానే 125 కోట్లు ఇస్తున్నారంట. అంటే బడ్జెట్ లో సగం ఆయన కోసమే కేటాయించారు. ఈ మూవీ కథ మొత్తం ఒక ప్యాలెస్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. అందుకే వీలైనంత తక్కువ ప్రొడక్షన్ ఖర్చుతో రాజాసాబ్ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ప్రభాస్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. దీంతో సినిమాపై ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయ్యింది. కామెడీ పండించడంలో ప్రభాస్ కి మంచి టైమింగ్ ఉంది. అందుకే రాజా సాబ్ చిత్రంతో పూర్తిస్థాయిలో ప్రభాస్ ఫన్ క్రియేట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాకి ప్రభాస్ 125 కోట్ల రెమ్యూనరేషన్ లెక్క అయిన కూడా ఆయన చేతికి అందేది 85 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది.
దీనికి కారణం ఆదిపురుష్ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ ని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ నుంచి తీసుకొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇచ్చారు. ఆ సినిమా 35 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చింది. ఈ కారణంగా ప్రభాస్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని రాజా సాబ్ మూవీ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్ నటిస్తుంది. అలాగే నిధి అగర్వాల్, సిద్ది కుమార్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.