సలార్ లా ట్విస్ ఇవ్వకుంటే.. ప్రభాస్ బోణి పక్కా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం సినిమాల విడుదల వాయిదా టాపిక్ నడుస్తోంది
By: Tupaki Desk | 24 Jan 2024 5:33 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మొత్తం సినిమాల విడుదల వాయిదా టాపిక్ నడుస్తోంది. పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ల ఛేంజ్ కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. దేవర రిలీజ్ పోస్ట్ పోన్ పక్కా అని తెలుస్తోంది. ఇక, ప్రభాస్ కల్కితోపాటు అల్లుఅర్జున్ పుష్ప-2 కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ.. తొలుత ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి.. ఆగస్టు 15న విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక అదే రోజు విడుదల కావాల్సి ఉన్న పుష్ప-2.. క్రిస్మస్ కు పోస్ట్ పోన్ అవుద్దని టాక్ నడుస్తోంది. మరోవైపు, సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉన్న కల్కి మూవీ కూడా వాయిదా పడుద్దని సమాచారం.
ఇప్పుడు నెట్టింట ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. మే9వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్న కల్కి మూవీ కనుక పోస్ట్ పోన్ అవ్వకపోతే.. ప్రభాస్ అరుదైన ఘనత సాధించనున్నారు. వరుసగా మూడో ఏడాది.. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ను స్టార్ట్ చేయనున్నారు. 2022లో రాధేశ్యామ్, 2023లో ఆదిపురుష్ చిత్రాలతో వచ్చిన ప్రభాస్.. ఈఏడాది కల్కితో రానున్నారు.
రాధేశ్యామ్, ఆదిపురుష్ తో ఫ్లాపులు మూటగట్టుకున్న ప్రభాస్.. ఈ సారి మాత్రం పాన్ ఇండియా మూవీ కల్కితో హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. దానికి తోడు దేవర పోస్ట్ పోన్ అవ్వడం వల్ల.. సమ్మర్ సోలో రిలీజ్ ప్రభాస్ కు దక్కనుందని చెబుతున్నారు. దీంతో కల్కి మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే మూడు పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ వాయిదా అంటూ వార్తలు వస్తున్నా... బజ్ ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. మరోవైపు, ఈ మూవీల పోస్ట్ పోన్ ఎఫెక్ట్.. మిగతా చిత్రాలపై కూడా ఉంటుంది. అందుకే మేకర్స్ రిలీజ్ డేట్ లపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని సినీ ప్రియులు కోరుతున్నారు. సలార్ లా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించొద్దని అంటున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.