కల్కి 2898కిది బిగ్ షాక్..దెబ్బ గట్టిగానే పడుతుందే!
ఇక సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతో వరల్డ్ టెక్నిషీయిన్లు సైతం రిలీజ్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
By: Tupaki Desk | 31 Jan 2024 10:44 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `కల్కీ2898` భారీ అంచనాల మధ్య మే9న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ నే షేక్ చేయడానికి రెడీ అవుతోంది. కల్కి ద్వారా ప్రపంచానికి ప్యూచర్ ఇండియాని చూపించబోతున్నారు. ఈ విషయాన్ని ముందే రివీల్ చేయడంతో! ప్రపంచ దేశాల్లో ఇండియా ఎలా ఉండబోతుంది? నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడు? అన్న ఉత్సహం రెట్టింపు అయిపోతుంది.
ఇక సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడంతో వరల్డ్ టెక్నిషీయిన్లు సైతం రిలీజ్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా ఎటు చూసినా వరల్డ్ అంతా కల్కీ మయంగానే కనిపిస్తుంది. ఈ ప్రచారం ఇండియా వరకూ ఠారెత్తిపోతుంది. కానీ విదేశాల్లో సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కల్కీతో పాటు మరో రెండు మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ చిత్రాలు అదే రోజు రిలీజ్ అవుతున్నాయి.
అవే.. `పురీసో: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా`.. `కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఆప్స్`. ఈ రెండు ఫ్రాంచైజీలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర దేశాల నుంచే కాదు మన దేశంలో కూడా ఈ సినిమాలంటే పిచ్చిగా వెయిట్ చేస్తున్న వాళ్లెంతో మంది. కానీ ఇక్కడ ఈ రెండు సినిమాలు పెద్ద పోటీ కాదు. కానీ ఇతర దేశాల నుంచి మాత్రం కల్కి కి పంచ్ తప్పదనే తెలుస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే కల్కి కి వాటి రూపంలో ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తుంది.
థియేటర్ల సర్దుబాటు దగ్గరే కల్కీపై పంచ్ పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని బిగ్ అండ్ ఐమాక్స్ పార్మెట్ లో రిలీజ్ కల్కికి ఆటంకంగా మారుతుంది. ప్లానెట్ ఆప్ ది ఏప్స్ మే 9న రిలీజ్ అవ్వడంతో రెండు వారాలు పాటు ఐమ్యాక్స్ - బిగ్ పార్మెట్ స్క్రీన్లు అన్ని హాలీవుడ్ చిత్రానికే కేటాయిం చినట్లు ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. కేవలం కల్కి ప్రీమియర్ షోకి మాత్రమే అమెరికా బిగ్ స్క్రీన్స్ దొరికాయి. అదీ ఒక రోజు ముందు కావడంతోనే సాధ్యమైంది.
దీంతో ప్రధాన థియేటర్లు అన్ని హాలీవుడ్ చిత్రానికే వెళ్లిపోవడంతో `కల్కి`కి అక్కడే షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని కేవలం బిగ్ స్క్రీన్ లలో చూస్తేనే ఆ మజా దొరుకుతుంది. అది సినిమా రెవెన్యూకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఏ సినిమాకైనా మౌత్ టాక్ కీలకం కాబట్టి ఆటాక్ తోనే జనాల్లోకి సినిమా వెళ్లిపోతుంది. తొలి వారం వసూళ్లే కీలకం కాబట్టి వీలైనన్ని ఎక్కవ స్క్రీన్లలోనూ వదులుతారు. కానీ విదేశీ మార్కెట్ లో కల్కీకి ఆ ఛాన్స్ కనిపించడం లేదు.