ఈ సమ్మర్ కి మొనగాడు ఒక్కడే..!
కానీ కొన్ని సినిమాలు వాయిదా పడటం.. కొన్ని సినిమాలు డేట్ మార్చడంతో సమ్మర్ ఆశించినంత కిక్ ఇచ్చే అవకాశం లేదు
By: Tupaki Desk | 4 March 2024 6:30 PM GMTస్టార్ సినిమాలకు సమ్మర్ అనేది ఒక లక్కీ టైం గా చెప్పుకుంటారు. ఫెస్టివల్ టైం లో ఎలా అయితే రికార్డులు సృష్టిస్తాయో సమ్మర్ సినిమాలకు ఒక హిస్టరీ ఉంది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వచ్చే సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసిన చరిత్ర ఉంది. 2025 సమ్మార్ లో కూడా అలాంటి బీభత్సం ఉంటుందని అనుకున్నారు. కానీ కొన్ని సినిమాలు వాయిదా పడటం.. కొన్ని సినిమాలు డేట్ మార్చడంతో సమ్మర్ ఆశించినంత కిక్ ఇచ్చే అవకాశం లేదు.
ఈ సమ్మర్ కి ఒకే ఒక్క మొనగాడుగా రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి సినిమా మొదటి పార్ట్ కల్కి 2898 AD మే 9న రిలీజ్ లాక్ చేశారు. సినిమాను హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ ప్లానింగ్ తో చేస్తున్నాడు నాగ్ అశ్విన్. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో 6 వేళ సంవత్సరాల నుంచి ఈ కథ చెప్పబోతున్నారట.
సమ్మర్ కి అటు క్లాస్ ఇటు మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు ప్రభాస్. కల్కి సినిమా ప్రచార చిత్రాలతోనే అంచనాలు పెంచేశారు. కల్కి సినిమా లో కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా నటించడం కూడా సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. దీపిక పదుకొనె ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా దిశా పటాని, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కూడా కల్కిలో భాగం అవుతున్నారు.
నాగ్ అశ్విన్ కల్కి సినిమా విజువల్ వండర్ గా ఆడియన్స్ ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారని తెలుస్తుంది. సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సమ్మర్ కి సరైన సినిమా పడితే సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఆ సినిమా కల్కినే అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మిగతా స్టార్ హీరోలంతా కూడా సమ్మర్ ని ఖాళీ చేయగా ఈ సమ్మర్ కి బాక్సాఫీస్ మొనగాడుగా ప్రభాస్ నిలుస్తాడని చెప్పొచ్చు.
కల్కి సినిమా కేవలం పాన్ ఇండియా భాషల్లోనే కాదు ఇంగ్లీష్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. అదే జరిగితే ప్రభాస్ ఇక మీదట పాన్ ఇండియా స్టార్ కాదు పాన్ వరల్డ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.