Begin typing your search above and press return to search.

కల్కి అశ్వత్థామ.. నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు..?

అయితే ఫైనల్ గా ఆ ప్రశ్నలకు సమాధానంగా తాను అశ్వత్థామ.. ద్రోణాచార్యుడి కొడుకుని అని చెబుతాడు.

By:  Tupaki Desk   |   23 April 2024 2:11 PM GMT
కల్కి అశ్వత్థామ.. నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు..?
X

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ ఆ అశ్వద్ధామ పాత్రని పరిచయం చేశారు. అశ్వత్థామ పాత్రలో బిగ్ బీ అమితాబ్ బచన్ నటించారు. కల్కి టీజర్ ను అబ్సర్వ్ చేస్తే 2800 కాలం లో ఒక పిల్లాడు ఒక అతని దగ్గరకు వచ్చి మీరు ఎవరు అని అడుతాడు. మీరు ఏ భాషలో మాట్లాడతారంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. అయితే ఫైనల్ గా ఆ ప్రశ్నలకు సమాధానంగా తాను అశ్వత్థామ.. ద్రోణాచార్యుడి కొడుకుని అని చెబుతాడు.

అమితాబ్ పాత్రని పరిచయం చేస్తూ అశ్వత్థామని పరిచయం చేసిన తీరు బాగుంది. అయితే కల్కి సినిమాకు అశ్వత్థామకు సంబంధం ఏంటి. అసలు కల్కి కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అన్న విషయాల మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో అసలు అశ్వత్థామ ఎవరు.. మహా భారతం లో ఆయన పాత్ర ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహా భారతం లో ధర్మాన్ని రక్షించిన వారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఈర్ష్య, ధ్వేషం, అజ్ఞానత్వం ఇలా అధర్మమైన వారి గురించి కూడా కొన్ని కథలు ఉంటాయి. అలాంటి వారి గురించి విని అధర్మం, ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన ఎంత శిక్షార్హుడను చేస్తుంది. ఆఖరికి శ్రీ మహావిష్ణువు శాపగ్రస్తుడు అవుతారన్నది తెలుస్తుంది. అలాంటి కథల్లో ఒకటి అశ్వత్థామ కథ.

అశ్వత్థామ జననం :

పాండవుల గురువు ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు, కృపిలకు అతను జన్మిస్తాడు. కర్ణుడికి ఎలా అయితే కవచ కుండలాలతో జన్మిస్తాడో.. అశ్వద్ధామ కూడా నుదుటన మణితో పుడతాడు. ఆ మణి వల్ల అతనికి శస్త్ర వల్ల భయపడాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ఏడుగురు చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకడు. బలి చక్రవర్తి, వ్యాసుడు, కృపాచార్యుడు, విభీషణుడు, హనుమంతుడు, పరుశురాముడు తో పాటు ఏడో అశ్వత్థామ కూడా చిరంజీవులుగా చెప్పబడతారు.

పాండవులపై అశ్వత్థామ ఉద్రేకం :

మహా భారతంలో పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం లో కౌరవులందరినీ పాండవులు మట్టి కరిపిస్తారు. భీముడి చేత తొడలు విరగొట్టుకుని దుర్యోధనుడు కుప్పకూలిపోతాడు. అది చూసిన అశ్వత్థామ ఆగ్రంతో ఉప పాండవులను సంహరిస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత శిబిరాల్లో పడుకుని ఉన్న ఉప పాండవులను అంటే భీమ ధర్మరాజు, నకుల, సహదేవ, అర్జునులకు ద్రౌపది తో జన్మించిన ఐదుగురు కుమారులను అశ్వత్థామ చంపేస్తాడు. కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుని దగ్గరకు వచ్చి నీ ప్రాణం పోతున్న ఈ సమయంలో నీకొక శుభవార్త.. ఉపపాండవులను సంహరించాను. పాండవులకు వంశం లేదని చెబుతాడు.

అశ్వత్థామపై బ్రహ్మాస్త్రం :

కుమారులను సంహరించాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామను వెంట పడతాడు. అర్జునుడి మీద తన తండ్రి ద్వారా పొందిన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తాడు అశ్వత్థామ. అర్జునుడు కూడా పాశుపతాస్త్రం ప్రయోగిస్తాడు. అయితే రెండు బ్రహ్మాస్త్రాలు ఢీ కొంటే లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన వ్యాస మహర్షి అస్త్రాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తారు.

అర్జునుడు వ్యాస మహర్షి చెప్పిన మాట విని బ్రహ్మాస్త్రాన్ని ఉప సం హరించుకుంటాడు. అయితే అశ్వత్థామని కూడా అస్త్రాన్ని ఉపసంహరించుకోమని చెప్పగా అతను అర్జునుడు కోడలు గర్భవతియైన ఉత్తర మీదకు మళ్లిస్తాడు. అప్పుడు అశ్వత్థామ చేసిన పనికి కోపోయుక్తుడైన కృష్ణుడు పాండవుల వారసుడిని కాపాడుతాడు.

కృష్ణుడు శాపం :

అర్జునుడు కోడలి మీద బ్రహ్మాస్త్రం వేసిన అశ్వత్థామ మీద కోపంతో కృష్ణుడు శాపం విధిస్తాడు. కుష్టు వ్యాధితో 3 వేల ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతకమని శపిస్తాడు. అశ్వత్థామని శపించడానికి ముందు కృష్ణుడు అతని నుదుటన ఉన్న మణిని తీసుకుంటాడు. ఆ మణి వల్లే అతనికి శాస్త్రాల భయం ఉండేది కాదు. కృష్ణుడు శాపం వల్ల నెత్తురుతో, చీముతో మానని గాయాలతో అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చెబుతుంటారు.

అశ్వత్థామ గురించి బయట జరుగుతున్న ప్రచారం :

మహాభారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని కొందరు అంటుంటారు. ఉత్తరాదిన కొందరు ఆయన్ను హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అశ్వత్థామ జీవిస్తున్నాడని అంటుంటారు. యూపీలో శివుడి గుడిలో రోజు రాత్రుల్లో అశ్వత్థామ వచ్చి పూజలు చేస్తాడని కొందరు చెబుతుంటారు. ఇలా అశ్వత్థామ ఇప్పటికీ ఉన్నాడని ప్రచారంలో ఉంది.

కల్కి లో అశ్వత్థామ చూపించడంతో ఇది దశావతారాల కథగా వస్తుందా. లేక చిరంజీవుల కథ గురించి చెబుతున్నాడా.. లేదా అశ్వద్ధామ శాప విముక్తి ఉంటుందా.. కలియుగంలో మహా విష్ణువు మరో అవతారం ఎత్తుతాడా అన్న సందేహాలు మొదలవుతున్నాయి.