Begin typing your search above and press return to search.

ఆ రెండు రికార్డ్స్.. కల్కి సాధించి ఉంటే..

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన మూవీ అంటే కల్కి 2898ఏడీ అని చెప్పాలి

By:  Tupaki Desk   |   8 Aug 2024 6:44 AM GMT
ఆ రెండు రికార్డ్స్.. కల్కి సాధించి ఉంటే..
X

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన మూవీ అంటే కల్కి 2898ఏడీ అని చెప్పాలి. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో బాలీవుడ్ ఆధిపత్యం బాక్సాఫీస్ పై కనిపించింది. అయితే ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా మరల టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది. కల్కి 2898ఏడీ మూవీ అన్ని లెక్కలు మార్చేసింది. టాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన అతి పెద్ద హిట్ మూవీగా కల్కి నిలిచింది.

కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటి వరకు 1150+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో బాహుబలి 2 తర్వాత మరో 1000 కోట్ల కలెక్షన్స్ మూవీగా కల్కి నిలిచింది. ఇదే ఊపుతో రానున్న సినిమాలతో కూడా ప్రభాస్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ వేట కొనసాగించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. వరల్డ్ మార్కెట్ లో కూడా ప్రభాస్ మీద నెక్స్ట్ సినిమాలకి 500+ కోట్లకి పైగానే బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లని సొంతం చేసుకున్న కల్కి మూవీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి ఇబ్బంది పడింది. మిగిలిన అన్ని ప్రాంతాలలో భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ ఓ రెండు రికార్డ్స్ ని కొద్దిలో మిస్ చేసుకుందనే మాట వినిపిస్తోంది. నార్త్ అమెరికాలో కల్కి మూవీ ఇప్పటి వరకు 18.5+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బాహుబలి 2 మూవీ 20.77 కలెక్షన్స్ తో టాప్ ఇండియన్ మూవీ గా ఉంది.

ఈ రికార్డ్ ని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కల్కి మూవీ మరో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఉంటే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయ్యేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే హిందీలో సౌత్ డబ్బింగ్ మూవీల కలెక్షన్స్ పరంగా కల్కి టాప్ 3లో నిలిచింది. ఇది వరకు ఆర్ఆర్ఆర్ మూవీ 276 కోట్లతో టాప్ 3లో ఉంది. దానిని కల్కి బ్రేక్ చేసింది. సీక్వెల్స్ తో కాకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా కల్కి టాప్ లో ఉంది.

అయితే లాంగ్ రన్ లో 300 కోట్ల కలెక్షన్స్ ని కల్కి మూవీ వసూళ్లు చేస్తుందని అందరూ భావించారు. కానీ 290+ కోట్లు కలెక్షన్స్ మాత్రమే ఇప్పటి వరకు అందుకుంది. కల్కి లాంగ్ రన్ ఎండ్ అయిపోవడంతో 300 కోట్లు దాటే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది. ఈ రెండు రికార్డ్స్ ని కల్కి సాధించి ఉంటే బాగుండేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, ప్రభాస్, అమీర్ ఖాన్, రాకింగ్ స్టార్ యష్ లు సోలోగా 1000 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలుగా ఉన్నారు.