Begin typing your search above and press return to search.

కల్కి బెస్ట్ ఇవ్వడానికి డైరెక్టర్ తిప్పలు..!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 AD. మొన్నటి వరకు ప్రాజెక్ట్ కే పేరిట ఈ మూవీని పిలుస్తూ వచ్చారు. కాగా, అమెరికాలో `శాన్ డియాగో కామిక్ కాన్‌` ఈ వెంట్ లో మూవీ టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   30 July 2023 1:56 PM GMT

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 AD. మొన్నటి వరకు ప్రాజెక్ట్ కే పేరిట ఈ మూవీని పిలుస్తూ వచ్చారు. కాగా, అమెరికాలో `శాన్ డియాగో కామిక్ కాన్‌` ఈ వెంట్ లో మూవీ టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఇటీవల టీజర్ విడుదల చేయగా, అది విపరీతంగా ఆకట్టుకుంది. మొదట ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి చాలా మంది విమర్శించారు. చీప్ ఎడిటింగ్, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని కొందరు, మరో ఆదిపురుష్ అవ్వడం ఖాయమంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఒక్కసారి టీజర్ చూసిన తర్వాత, అందరి నోళ్లు మూతబడ్డాయి.

అయితే, టీజర్ ఎంత బాగున్నా ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది. అంతేకాదు, కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటిపై ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫోకస్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి..? నెక్ట్స్ టైమ్ అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటర్ అనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారట.

అయితే, ఇప్పుడిప్పుడే ఈ మూవీ నుంచి మళ్లీ అప్ డేట్ అవకాశం అయితే కనపడటం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం సలార్ మూవీ పూర్తవ్వాలి. ఆ మూవీ పూర్తయ్యే, విడుదల అయ్యే వరకు కల్కి నుంచి కొత్తగా అప్ డేట్ రాదు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు కాబట్టి, నెక్ట్స్ వచ్చేది ఇక ట్రైలరే. దాని కోసం కనీసం దసరా వరకు ఆగాల్సిందే.

అయితే, ఆలోపు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్ఫెక్ట్ గా ట్రైలర్ విడుదల చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారట. మొన్నటిలాగా కాకుండా, ట్రైలర్ మరింత అదిరిపోయేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ మూవీ కూడా రెండు భాగాలుగా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు మే 9వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈరోజే విడుదల చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ మే9వ తేదీన నిర్మాత అశ్వినీ దత్ కి చాలా స్పెషల్ రోజు అట.ఆయన నిర్మాణ రంగం నుంచి వచ్చిన జగదీక వీరుడు, అతి లోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో, ఈ రోజున విడుదల చేస్తే, ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.