Begin typing your search above and press return to search.

ప్రభాస్.. నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చింది

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలను ఎట్రాక్ట్ చేయాల్సి ఉంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది జూన్ 27న తెలిసిపోనుంది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:26 AM GMT
ప్రభాస్.. నిరూపించుకోవాల్సిన టైమ్ వచ్చింది
X

డార్లింగ్ ప్రభాస్ కి మాస్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువగానే ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఉంది. ప్రభాస్ నుంచి వచ్చిన ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, బాహుబలి సిరీస్ లు అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ పెరిగేలా చేశాయి. ప్రభాస్ నుంచి మూవీ వస్తుందంటే అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ రాలేదు.

సాహో మూవీ ప్యూర్ మాస్ యాక్షన్ చిత్రంగానే ఉంటుంది. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. తరువాత వచ్చిన రాధేశ్యామ్ ని లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అనుకున్నారు. అది సాధ్యం కాలేదు. అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా సినిమా నచ్చలేదు. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తరువాత వచ్చిన సలార్ మూవీ ప్యూర్ మాస్ ఆడియన్స్ ని మెప్పించే మూవీగానే నిలిచింది.

సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించిన బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకోలేదు. చాలా కాలం తర్వాత పూర్తిస్థాయిలో మాస్, క్లాస్ ఆడియన్స్ ని మెప్పించే కథాంశంతో ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ చేశాడు. సైన్స్ ఫిక్షన్ కి మైథాలజీ కాన్సెప్ట్ ని జోడించి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తుంటే పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ డ్రామా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉందని అర్ధమవుతోంది. ఈ కారణంగా సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. మైథాలజీ ఎలిమెంట్స్ ని ఎడాప్ట్ చేసుకోవడంతో హిందూ పురాణాలు బిలీవ్ చేసేవారికి కల్కి మూవీ నచ్చుతుందని చెప్పొచ్చు.

ఈ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలను ఎట్రాక్ట్ చేయాల్సి ఉంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది జూన్ 27న తెలిసిపోనుంది. కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఈ బ్యానర్ లో వస్తోన్న సినిమా అంటే ప్రేక్షకులకి కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. వైజయంతీ నుంచి వచ్చిన చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. కల్కి మూవీ కూడా సాలిడ్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.