కల్కి.. అసలు పరీక్ష ఈరోజు నుంచే
పాన్ ఇండియా సినిమాలకి ముందుగా జరిగే అడ్వాన్స్ బుకింగ్, ఫ్యాన్ బేస్ కారణంగా వీకెండ్ మూడు, నాలుగు రోజులు కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి
By: Tupaki Desk | 1 July 2024 4:07 AM GMTపాన్ ఇండియా సినిమాలకి ముందుగా జరిగే అడ్వాన్స్ బుకింగ్, ఫ్యాన్ బేస్ కారణంగా వీకెండ్ మూడు, నాలుగు రోజులు కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. టికెట్ ధరలు ఎంత ఉన్న కూడా ఫ్యాన్స్ థియేటర్స్ కి వచ్చి మూవీ చూడటానికి ఇష్టపడతారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అందరూ ఆ రోజుల్లో మూవీస్ చూడటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే వీకెండ్ పూర్తయిన తర్వాత ఆఫీస్ లు ప్రారంభం అవుతాయి, స్కూల్, కాలేజీ లు ఓపెన్ అవుతాయి.
అందరూ ఎవరి వ్యాపకాలలో వారు బిజీ అయిపోతారు. అందుకే గణనీయంగా కలెక్షన్స్ తగ్గుతాయి. అయితే వీకెండ్ పూర్తయిన సినిమా బాగుంటే మాత్రం ప్రేక్షకుల ఆదరణ అందుకునే ఛాన్స్ ఉంటుంది. మొదటి రెండు ఆటలకి సందడి తగ్గిన ఫస్ట్ షో, సెకండ్ షోకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈవెనింగ్ టైంలో ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలని అనుకుంటారు. ఈ కారణంగా బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సిరీస్ లకి భారీ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రభాస్ సలార్ మూవీకి మొదటి మూడు రోజులు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి . వీక్ డేస్ లో దారుణంగా ఆదాయం పడిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ నుంచి వచ్చిన కల్కి 2898ఏడీ సినిమాకి మొదటి నాలుగు రోజులు అద్భుతమైన ఆదరణ లభించింది. వరల్డ్ వైడ్ గా 500+ కోట్ల కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి. నాలుగు రోజుల్లో ఈ స్థాయిలో కలెక్షన్స్ అంటే నిజంగా రికార్డ్ అని చెప్పాలి.
అయితే ఈ రోజు నుంచి కల్కికి అసలు పరీక్ష మొదలవుతుంది. వీకెండ్ ముగియడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభం అయ్యాయి. అలాగే ఉద్యోగస్తులు ఆఫీస్ లకి వెళ్ళిపోతారు. పబ్లిక్ ఎవరి పనుల్లో వారు ఉంటారు. ఈ రోజు మూవీకి పికప్ ఎలా ఉంటుందనే దానిని బట్టి మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ పైన ఒక క్లారిటీ వస్తుంది. కల్కి సినిమాకి ఇప్పటి వరకైతే అద్భుత ఆదరణ లభించింది.
ఈ వారం కూడా నిలకడగా కలెక్షన్స్ రాబడితే 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది. కచ్చితంగా కల్కి 2898ఏడీ మూవీ వెయ్యి కోట్ల మార్క్ దాటాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభాస్ స్టామినాకి తగ్గ రెస్పెక్ట్ దొరికినట్లు అవుతుంది. అలాగే మూవీకి వచ్చిన హిట్ టాక్ కి ఒక వేల్యూ ఉంటుంది. నిర్మాత కూడా లాభాల బాట పడతారు. నార్త్ ఇండియాలో కల్కికి ఆదరణ పెరిగిన నేపథ్యంలో కలెక్షన్స్ కచ్చితంగా అంచనాలకి మించి వస్తాయని ట్రేడ్ పండితులైతే చెబుతున్నారు. మరి ఎంత వరకు అది సాధ్యం అవుతుందనేది చూడాలి.