Begin typing your search above and press return to search.

కల్కి.. ఇది కదా అసలు రియాక్షన్

తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   28 Jun 2024 12:05 PM GMT
కల్కి.. ఇది కదా అసలు రియాక్షన్
X

తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ మూవీ ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే రిలీజ్ తర్వాత కూడా బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి. మూడు గంటల నిడివి ఉన్న కూడా అదిరిపోయే విజువల్స్ తో ప్రేక్షకులని ఈ చిత్రం కట్టిపడేస్తోంది. కచ్చితంగా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కల్కి నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో సూపర్ హీరోగా నటించాడు. ఇక దీపికా పదుకునే కల్కికి జన్మనివ్వబోయే సుమతిగా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి వస్తోన్న ఆదరణ బట్టి మొదటి రోజు ఈ సినిమాకి 200+ కోట్లు రావొచ్చని భావిస్తున్నారు. ఈ సినిమాకి డిజిటల్ బుకింగ్ యాప్ బుక్ మై షో ఏకంగా 9.3 రేటింగ్స్ ఇచ్చింది. పేటీఎం యాప్ కూడా 96% ప్రేక్షకాదరణ ఉన్నట్లు రేటింగ్ ఇచ్చింది. అలాగే ఐఎండిబిలో 8.4 రేటింగ్స్ ని కల్కి మూవీ దక్కించుకుంది.

గూగుల్ లో అవుట్ ఆఫ్ 5కి 4.8 రేటింగ్ వచ్చింది. దీనిని బట్టి మూవీకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఈ మూవీ కథ చెప్పడంతో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఊహించని స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చరిష్మా, నాగ్ అశ్విన్ సృష్టించిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టయం ఖాయం అనే మాట వినిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాని చూసేవారికి మంచి ఎక్స్ ప్రీరియన్స్ ఇస్తున్నాయి. వీకెండ్ వరకు సినిమా కలెక్షన్స్ ని ఎవరూ ఆపలేరని మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మైథాలజీ ఎలిమెంట్ ఉండటం వలన పెద్దల నుంచి పిల్లల వరకు అందరికి ఈ సినిమా అద్భుతంగా కనెక్ట్ అవుతోంది.

ఇదే జోరుని కొనసాగితే కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులని కల్కి మూవీ బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మూవీ క్రిటిక్స్ సినిమాలో కొన్ని ప్రతికూలతలు చెబుతున్న పబ్లిక్ మాత్రం కల్కికి బ్రహ్మరథం పడుతున్నారు. సెలబ్రెటీలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ అద్భుతంగా ఉందని అభివర్ణిస్తున్నారు.