లేటయినా 'కల్కి' మంచికే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898ఏడీ
By: Tupaki Desk | 20 April 2024 4:42 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898ఏడీ. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ సినిమా రెండు భాగాలుగా సిద్ధం అవుతోంది. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటిస్టార్ క్యాస్టింగ్ మూవీలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
కచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కల్కి 2898 ఏడీ పార్ట్ 1 మే నెలలో రిలీజ్ చేస్తామని డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్స్ హడావిడి ప్రస్తుతం నడుస్తోంది.
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ మూవీ పబ్లిసిటీ మీద, అలాగే ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుందని చిత్ర యూనిట్ భావించింది. దీంతో మూవీ రిలీజ్ వాయిదా వేయడానికి మొగ్గు చూపించారు. అయితే డిస్టిబ్యూటర్స్ నుంచి రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఒత్తిడి ఎదురవుతుందని టాక్. త్వరలో కొత్త రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయాలని కోరుతున్నారంట.
మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా కొంత ఆలస్యం అవుతోంది. మూవీ సీజీ వర్క్ ఇంకా కొంత పెండింగ్ ఉందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ కు సంబంధించిన గ్రాఫిక్స్ సీన్స్ కోసం టైమ్ ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే దర్శకుడు సీజీ కంపెనీకి డెడ్ లైన్ కూడా ఇచ్చినట్లు టాక్. అయితే కొన్ని సీన్స్ అనుకున్నట్లు రాకపోవడంతో మళ్ళీ వర్క్ చేయిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది.
ఎలక్షన్స్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవడం మంచిదే అని ఆడియెన్స్ లో పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఈ క్రమంలో కొంత గ్రాఫిక్స్ సీన్స్ ను మెరుగు పరిచేందుకు మేకర్స్ కు టైమ్ కూడా దొరికింది. ఏది ఏమైనా కల్కికి ఆలస్యం మంచిదే. ఇక మే నెలఖారులో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని డిస్టిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారంట. దీంతో చిత్ర యూనిట్ ని కొత్త టెన్షన్ అయితే ఉంది. రిలీజ్ డేట్ పై శుక్రవారం క్లారిటీ వస్తుందని ప్రచారం నడిచింది. మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడి ఇంకా మొదలుకాలేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని కల్కి మూవీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చిత్ర యూనిట్ అయితే అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తే అనుకున్న టార్గెట్ ని అందుకోగలరని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రభాస్ అభిమానులు కూడా మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వీటన్నింటికి నాగ్ అశ్విన్ టీమ్ ఏ విధంగా సమాధానం చెబుతుందనేది వేచి చూడాలి.