Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD ఎందుకింత ఆల‌స్యం?

క‌ల్కి చిత్రాన్ని ఒక అద్భుత‌ దృశ్యకావ్యంగా మలిచేందుకు నాగ్ అశ్విన్ బృందం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కేవ‌లం ప్రీప్రొడ‌క్ష‌న్ కోస‌మే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 3:47 AM GMT
కల్కి 2898 AD ఎందుకింత ఆల‌స్యం?
X

ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స‌లార్ గ్రాండ్ స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 700కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సెన్సేష‌న్. అంత‌కుమించి అనిపించేలా గ్రాండ్ స్కేల్ పై స‌లార్ సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. ఇక స‌లార్ ఫ్రాంఛైజీని మించేలా మ‌రో భారీ ప్రాజెక్ట్ ప్ర‌భాస్ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తున్న 'కల్కి 2898 AD' భార‌త‌దేశంలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతోంది. క‌ల్కి నుంచి ఇప్ప‌టికే ప్ర‌భాస్ పోస్ట‌ర్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజ్ తేదీ మారింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మే 2024లో క‌ల్కి థియేటర్లలోకి విడుద‌ల కానుంది.

క‌ల్కి చిత్రాన్ని ఒక అద్భుత‌ దృశ్యకావ్యంగా మలిచేందుకు నాగ్ అశ్విన్ బృందం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. కేవ‌లం ప్రీప్రొడ‌క్ష‌న్ కోస‌మే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నాడు. సినిమాని తెర‌కెక్కించడం కంటే ఇంజనీరింగ్ ప‌ని వ‌ల్ల‌నే సినిమా ఆల‌స్య‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో భ‌విష్యత్ కాలం గురించిన‌ ఇన్నోవేష‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో చూడ‌ని విధంగా ఉంటుంద‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు.. చాలా మ్యాట‌ర్ ఉంది! అంటూ దీపిక ప‌దుకొనే, అమితాబ్ లాంటి న‌టులు ఇంత‌కుముందే వెల్ల‌డించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఇందులో కంటెంట్ పూర్తి విభిన్నంగా ఉండ‌నుంది.

క‌ల్కి క‌థాంశం ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇది భవిష్యత్తు కాలంలో జరిగే పౌరాణిక ప్రేరేపిత సైన్స్ ఫిక్షన్ చిత్రం. భ‌విష్య‌త్‌లో ఈ విశ్వం ఎలా మారుతుంది? ఎలాంటి వాహ‌నాలు భూమిపై తిరుగుతాయి...ఎలాంటి అధునాత‌న ఆయుధాలు పుట్టుకొస్తాయి? అన్న‌ది ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. అవ‌స‌రం మేర వీట‌న్నిటి డిజైన్స్‌ రెడీ చేయించ‌డానికి, సెట్స్ కాస్ట్యూమ్స్ మేక‌ప్ వంటి అంశాల‌కే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుంటోంద‌ని చెబుతున్నారు. సినిమా మేకింగ్ కంటే ఇంజనీరింగ్ వర్క్ వల్లే ఎక్కువ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర‌హాలోనే ప్ర‌తిదీ డీటెయిల్డ్ గా ప్లాన్ చేస్తుండ‌డంతో ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతోందని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, కాశ్మీర్‌తో సహా పాన్-ఇండియాలోని పలు నగరాల్లో రైడర్‌ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ ప్రకటన చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇంత‌కుముందు విజయవాడ ఈవెంట్ సందర్భంగా రైడర్‌లు కలిసి కవాతు చేశారు. ప్రాజెక్ట్ కె గురించి నిరీక్షణను పెంచారు. 9 మే 2024న సినిమా విడుదలవుతుంద‌ని తేదీని ప్రకటించారు.

వైజయంతీ మూవీస్ అధినేత‌ సి. అశ్విని దత్ విడుదల తేదీ ప్రకటనపై తన ఆలోచనలను వ్యక్తం చేస్తూ, "వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సినిమా ప్రయాణంలో మే 9కి ఉన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' నుండి అవార్డులు గెలుచుకున్న 'మహానటి'.. 'మహర్షి' వరకు ఈ తేదీ మా సంస్థ‌ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇప్పుడు 'కల్కి 2898 AD' విడుదల మాకు ఈ తేదీ ఒక ప్రత్యేకఘ‌ట్టం కానుంది. వైజ‌యంతి సంస్థ 50ఏళ్ల ప్ర‌స్థానంలో అర్థ‌వంత‌మైన ప్ర‌య‌త్నం ఈ సినిమా" అని అన్నారు.

కల్కి 2898 ADకి గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్ర‌చారం సాగించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ద‌క్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో ఉత్కంఠ‌ను పెంచ‌డంలో నాగ్ అశ్విన్ స‌క్సెస‌య్యారు. క‌ల్కి బ‌హుభాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం అగ్ర తార‌ల అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.