సలార్ విజయంతో 'స్పిరిట్' 100 నుంచి 150...!
సౌత్ ఇండియాలో మొదటి వంద కోట్ల పారితోషికం, అంతకు మించి పారితోషికం అందుకున్న హీరో గా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు
By: Tupaki Desk | 26 Dec 2023 4:30 PM GMTసాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డా కూడా ప్రభాస్ సలార్ సినిమా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెల్సిందే. అంతే కాకుండా ప్రభాస్ పారితోషికం ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ తన ప్రతి సినిమాకు కూడా మినిమం గా రూ.100 కోట్ల పారితోషికం ను తీసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
సౌత్ ఇండియాలో మొదటి వంద కోట్ల పారితోషికం, అంతకు మించి పారితోషికం అందుకున్న హీరో గా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. తాజాగా సలార్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఆయన తదుపరి సినిమాలకు అందుకోబోతున్న పారితోషికం తో మరోసారి చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రభాస్ ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ను మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ప్రభాస్ చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే మొత్తంను ప్రభాస్ పారితోషికంగా టీ సిరీస్ తో ఒప్పందం చేసుకున్నాడు.
సలార్ కి ముందు వరకు ఆ రైట్స్ ఖరీదు రూ.100 కోట్లకు అటు ఇటుగా ఉండేది. కానీ సలార్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో స్పిరిట్ కచ్చితంగా రూ.150 కోట్లకు పైగానే బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సందీప్ వంగ సినిమా అంటే ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది.
స్పిరిట్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా 150 కోట్ల రూపాయల వసూళ్లు మించి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మినిమం గా రూ.200 కోట్లు వసూళ్లు నమోదు చేస్తే ఆ మొత్తం కూడా ప్రభాస్ యొక్క పారితోషికం అవుతుంది. అంటే ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా ప్రభాస్ స్పిరిట్ ద్వారా నిలువబోతున్నాడు.