ప్రభాస్ వెయ్యి కోట్ల లెక్క.. క్రేజ్ అలా ఉంది మరి!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 కూడా ఈ ఏడాదిలోనే షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది
By: Tupaki Desk | 2 April 2024 5:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు. మే నెలలో రాబోతున్న కల్కి 2898ఏడీ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా థియేటర్స్ లోకి రావాల్సింది. కానీ ఎన్నికల కారణంగా ఈ సినిమా సమ్మర్ చివరకు షిఫ్ట్ కానుంది. భారీ బడ్జెట్ తో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది. కల్కి మూవీ కోసం ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.
నెక్స్ట్ మూడేళ్ళకి సరిపడా ప్రాజెక్ట్స్ ని ప్రభాస్ ఇప్పటికే లైన్ లో పెట్టాడు. కల్కి 2898ఏడీ తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకి లాభాల్లో వాటాని ప్రభాస్ రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా కొంత ఫినిష్ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై మరో క్లారిటీ రానుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 కూడా ఈ ఏడాదిలోనే షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావొచ్చని టాక్. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ లో పాన్ వరల్డ్ చిత్రం ప్రభాస్ చేయనున్నాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ తెరకెక్కనుంది.
దీనికి కూడా 150 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ కల్కి పార్ట్ 2 కూడా రానుంది. స్పిరిట్ మూవీ కూడా రెండు భాగాలుగానే సందీప్ రెడ్డి తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్ళలో ప్రభాస్ నుంచి 6 సినిమాల వరకు రానున్నాయి. మరో రెండేళ్లలో రెండు సినిమాల అయిన డార్లింగ్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కోసం డైరెక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.
ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు ప్రభాస్ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కో సినిమాకి 120 నుంచి 150 కోట్ల మధ్య రెమ్యునరేషన్ వేసుకుంటే కేవలం ఐదేళ్ల టైమ్ లో ఏకంగా 1000 కోట్లకు పైగా ప్రభాస్ సినిమాల ద్వారా సంపాదిస్తాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఐదేళ్లలో వెయ్యి కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ గా తీసుకునే ఇండియా నెంబర్ వన్ స్టార్ గా ప్రభాస్ తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాడని చెప్పొచ్చు. ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్ సినిమాలు మినిమమ్ సక్సెస్ అందుకున్నా రెమ్యునరేషన్ లెక్క 200 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.