Begin typing your search above and press return to search.

ప్రభాస్ డబుల్‌ ధమాకా.. ఫ్యాన్స్‌ ఆందోళన

సూపర్ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   20 Aug 2024 11:30 AM GMT
ప్రభాస్ డబుల్‌ ధమాకా.. ఫ్యాన్స్‌ ఆందోళన
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మరియు ఇతర దేశాల్లో కూడా మురారి సినిమా రీ రిలీజ్ ను ఒక పండుగ మాదిరిగా జరుపుకున్నారు. మురారి రీ రిలీజ్ పండుగ తాలూకు హడావుడి ఇంకా పూర్తి అవ్వకుండానే ప్రభాస్ ఫ్యాన్స్‌ రీ రిలీజ్ పండుగను జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న డార్లింగ్‌ సినిమాతో పాటు ఆయన మొదటి సినిమా ఈశ్వర్ రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు డార్లింగ్‌ సినిమాను మాత్రమే రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ప్రముఖ సినిమా పంపిణీ సంస్థ ఈశ్వర్‌ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈ సమయంలో ఫ్యాన్స్ కి డబుల్‌ ధమాకా ఏమో కానీ, ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో మొదటి బిగ్ కమర్షియల్‌ హిట్‌ డార్లింగ్‌. అలాంటి సినిమాను చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉండటం చాలా సహజమైన విషయం.

ఈశ్వర్‌ కూడా ప్రభాస్ కెరీర్‌ లో అత్యంత కీలకమైన మూవీ. ప్రభాస్‌ మొదటి సినిమా అవ్వడంతో పాటు, ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఆ రెండు సినిమాల్లో ఏది చూడాలి అనేది తేల్చుకోలేక ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకేసారి రెండు సినిమాలను రీ రిలీజ్ చేయడం ను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ప్రత్యేక సందర్భం లేదా బర్త్‌ డే ఉంటే ఒకొక్క సినిమా చొప్పున రీ రిలీజ్ చేయాలి, అప్పుడే ఫ్యాన్స్ ఆ ఒక్క సినిమా ను పండుగల ఎంజాయ్ చేస్తూ చూస్తారు. ఇలా రెండు సినిమాలు ఉంటే ఫ్యాన్స్‌ విడి పోతారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికే ఆ రెండు సినిమాల్లో ఎవరు ఏ సినిమాకు వెళ్లాలి అనే విషయమై చర్చ మొదలైంది. ఇక ప్రభాస్ తాజా సినిమాల విషయానికి వస్తే సలార్ మరియు కల్కి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్‌ త్వరలో రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు సలార్‌ 2, ఫౌజీ, కల్కి 2 సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. రాజా సాబ్‌ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ప్రభాస్ నుంచి మరో రెండు మూడు వెయ్యి కోట్ల సినిమాలు రావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.