డార్లింగ్ డ్యాష్ అండ్ డేరింగ్ హీరో!
ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నేడు దేశంలోనే టాప్ హీరోగా కొనసాగు తున్నాడు.
By: Tupaki Desk | 20 Aug 2024 6:49 AM GMTప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నేడు దేశంలోనే టాప్ హీరోగా కొనసాగు తున్నాడు. ఎన్ని పరిశ్రమల నుంచి ఎంత మంది హీరోలున్నా? డార్లింగ్ ప్రభాస్ మాత్రం సపరేట్. ఇటీవలే `కల్కి 2898` తో గ్లోబల్ స్థాయిలోనూ వెలిగిపోతున్నాడు. ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్ మూవీ తీసారని అంతా ప్రశంశిస్తున్నారు. ప్రభాస్ ఇంతగా హైలైట్ అవ్వడానికి అతడి కటౌట్ ప్రధాన కారణం.
బాలీవుడ్ లో హృతిక్ రోషన్..టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ కటౌట్ మార్కెట్ లో కనిపించడం కష్టం. ఆ క్వాలిటీనే ప్రభాస్ ని మిగతా హీరోల నుంచి వేరు చేస్తుంది. ఇక డైరెక్టర్ల ఎంపిక విషయంలోనూ డార్లింగ్ డేర్ అండ్ డ్యాషింగ్ అనొచ్చు. `బాహుబలి` తర్వాత దర్శకుడిగా పెద్దగా అనుభవం లేని సుజిత్ తో `సాహో` చేసాడు. అదే తరహాలో `రాధేశ్యామ్` సినిమా చేసాడు. ఈ సినిమాని తెరకెక్కించిన రాధాకృష్ణకి దర్శకుడిగా అపార అనుభవం లేదు.
ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో `ఆదిపురుష్` చేసాడు. చరిత్ర నేపథ్యంపై ఓరౌంత్ కి టచ్ ఉన్నా? ఆదిపురుష్ విషయంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. అలా మూడు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో `సలార్` చేసాడు. ఇదే సమయంలో నాగ్ అశ్విన్ తో `కల్కి 2898` కి సైన్ చేసాడు. అయితే నాగీతో సినిమా చేయడంపై అప్పట్లో విమర్శలు తెరపైకి వచ్చాయి.
పాన్ ఇండియా స్టార్ ని నాగీ ఆ రేంజ్ లో చూపించగలడా? ప్రభాస్ సరైన నిర్ణయంతోనే ఉన్నాడా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. అంతకు ముందే మారుతితో `రాజాసాబ్` కమిట్ అయ్యాడు. ఈ సందర్భం లో డార్లింగ్ రాంగ్ రూట్లో వెళ్తున్నాడా? అన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం హనురాఘవ పూడితో `పౌజీ` చేస్తున్నాడు. కానీ సీనియర్ అయిన సిద్దార్ధ్ ఆనంద్ ఆఫర్ ని మాత్రం రిజెక్ట్ చేసారు.
ఇలా ప్రభాస్ ఎంపికలన్నీ షాకింగ్ గా అనిపించేవే. వీళ్లంతా దర్శకులుగా అపార అనుభవం ఉన్న వాళ్లు కాకపోవడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి హిట్ ఇస్తారు? అన్న సందేహం అభిమానుల్లో కలుగుతోంది. కానీ డార్లింగ్ మాత్రం డ్యాష్ అండ్ డేరింగ్ గా ముందుకెళ్లి పోతున్నారు.